వర్షాలే వర్షాలు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. దీనికి తోడు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అల్పపీడనాలు ఏర్పడ్డాయి.. అల్పపీడనాలకి అనుబంధంగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతుండడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నైరుతి, అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జూలైలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలులేని ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో వాతారణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తాయని.. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపింది.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో తెలంగాణలోని 19 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే చాన్స్ ఉంది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్‌లో సైతం భారీ వర్షం కురిసింది. సోమవారం హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో గంట పాటు వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

ఏపీ వెదర్ అలర్ట్..

ఆంధ్రప్రదేశ్‌లో రోజంతా మేఘాలు ఉంటాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల భారీగా కూడా పడుతుంది. ఉత్తరాంధ్రపై గాలులు వీస్తున్నాయి. రాయలసీమలో ఇవాళ పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇదిలాఉంటే.. అల్పపీడనాల ప్రభావంతో నార్త్ లో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి.. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే.. తమిళనాడు సహా పలు ప్రాంతాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది.

About Kadam

Check Also

నిరుద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్.. త్వరలోనే 5 జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయ్!

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్ల (డిప్యూటీ ఈఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *