సత్యసాయి గ్రామంలో మ్యూజిక్‌ మాస్ట్రో AR రెహమాన్ సందడి.. సాయి సంఫనీ ఆర్కెస్ట్రాపై ప్రశంసల జల్లు!

సత్యసాయి గ్రామంలో నిర్వహించిన సాయి సింఫనీ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని మ్యూజిక్‌ మాస్ట్రో ఏఆర్‌ రెహమాన్ సందర్శించారు. ఇందులో గ్రామీణ, పేద నేపథ్యాల నుంచి వచ్చిన 170 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్వదేశీ ఆర్కెస్ట్రా. రెహమాన్ సత్యసాయి గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా విద్యార్థులు ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు..

మ్యూజిక్‌ మాస్ట్రో, గ్రామీ, ఆస్కార్ విజేత ఏఆర్‌ రెహమాన్ సత్యసాయి గ్రామాన్ని సందర్శించారు. గ్లోబల్ హ్యుమానిటేరియన్, ఆధ్యాత్మికవేత్త మధుసూదన్ సాయి నేతృత్వంలోని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వివిధ మానవతా కార్యక్రమాలను పర్యవేక్షించారు. మధుసూదన్ సాయి మార్గదర్శకత్వంలో 2014లో సాయి సింఫనీ ఆర్కెస్ట్రా ప్రారంభమైంది. ఇందులో గ్రామీణ, పేద నేపథ్యాల నుంచి వచ్చిన 170 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్వదేశీ ఆర్కెస్ట్రా. రెహమాన్ సత్యసాయి గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా విద్యార్థులు ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. మిషన్ ఇంపాజిబుల్, పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సహా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గీతాలను ప్రదర్శించారు. గ్రీకు–అమెరికన్ మల్టీ ఇన్స్ట్రుమెంటలిస్ట్ అయిన మిస్టర్ డిమిట్రిస్ లాంబ్రియానోస్ ఆధ్వర్యంలో గురుకులం విద్యార్థులు శిక్షణ పొందారు.

సాయి సింఫనీ ఆర్కెస్ట్రాను వీక్షించిన రెహమాన్ తాను చూసిన అత్యుద్భుతమైన ప్రదర్శనల్లో ఇదొకటి అంటూ వారిపై ప్రశంసల జల్లు కురిపించారు. భవిష్యత్తులో దేశంలోనే అత్యుత్తమ సింఫనీగా గుర్తింపు పొందడానికి అన్ని అవకాశాలు ఈ విద్యార్థులకు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అత్యంత అరుదైన, విలువైన వాద్య పరికరాలను అందించి వారిలో నైపుణ్యాలను ప్రదర్శించేందుకు వీలు కల్పించిన వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్‌ ప్రశంసించారు.

సాయి సింఫనీ ప్రదర్శన అనంతరం మాట్లాడిన శ్రీ మధుసూదన్ సాయి.. రెహమాన్ తన ఫౌండేషన్ ద్వారా పేద వర్గాలకు సంగీతాన్ని అందించి ప్రోత్సహిస్తున్నారని, అలాగే వన్ వరల్డ్ -వన్ ఫ్యామిలీ మిషన్ కోసం థీమ్ సాంగ్‌ను కంపోజ్ చేస్తున్నారని చెప్పారు. అంతేకాదు శ్రీ మధుసూదన్ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రుల్లో రోగులకు స్వాంతన కల్గించేందుకు హీలింగ్ మ్యూజిక్‌ను కూడా కంపోజ్ చేస్తానని చెప్పినట్లు తెలిపారు.

About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *