జగన్‌కు మనుషుల ప్రాణాలంటే లెక్కలేదన్నారు సీఎం చంద్రబాబు. తన కారు కింద పడి మనిషి చనిపోయినా రాజకీయం చేయడం ఆయనకే చెల్లిందన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలతో ఏపీ అభివృద్ధి వెనక్కి వెళ్లిందన్నారు చంద్రబాబు.
వైసీపీ అధినేత జగన్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందన్నారు సీఎం చంద్రబాబు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో పాలన పడకేసిందన్నారు. పది లక్షల కోట్ల అప్పులు చేసి జగన్ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారన్నారు. సీఎంగా 15 ఏళ్ల అనుభవం ఉన్న తనకే రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఏడాది సమయం పట్టిందన్నారు సీఎం చంద్రబాబు. జగన్ కక్షపూరిత వైఖరి కారణంగా పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు చంద్రబాబు. 2027నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకింతం చేస్తామని ప్రకటించారాయన.
జగన్ పరామర్శల పేరుతో రౌడీయిజం చేస్తున్నారన్నారు ఏపీ సీఎం. పల్నాడు పర్యటనలో జగన్ వాహనం హిట్ అండ్ రన్ కారణంగా వైసీపీ కార్యకర్త సింగయ్య మరణించాడన్నారు.. జగన్‌కి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదన్నారు చంద్రబాబు. సింగయ్య మరణానికి జగన్ వాహనం కారణం కాదని వైసీపీ బుకాయించిందన్నారు ముఖ్యమంత్రి.. దానికి తగినట్లు సాక్ష్యాలు కూడా సిద్ధం చేశారన్నారు. కానీ జగన్ కారు కిందే సింగయ్య పడి మరణించినట్లు పోలీసులు ఫోరెన్సిక్ సాక్ష్యాలు సేకరించారన్నారు చంద్రబాబు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం ఇచ్చి మాట నిలబెట్టుకున్నామన్నారు చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో సీఎం చంద్రబాబు NTR భరోసా పెన్షన్లు పంపిణీ చేశారాయన.
Amaravati News Navyandhra First Digital News Portal