తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో ఎగిసిపడ్డ మంటలు

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో మంటలు చెలరేగాయి. ఆలయం సమీప గోపురం ముందున్న షాపులకు మంటలు అంటుకున్నాయి. అవి క్రమంగా షాప్‌ మొత్తం విస్తరించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో ఆలయం ముందున్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. రెండు షాపులు గద్ధమయ్యాయి. భారీ అగ్ని కీలలు ఎగిసిపడటంతో స్థానికులతోపాటు భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

బుధవారం(జూలై 03) తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పాట్‌కి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, ఈలోపే షాపులో సామగ్రి, చలువ పందిళ్లు పూర్తిగా కాలిపోయాయి. భక్తులు పెద్దగా లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఓ దుకాణంలో విద్యుదాఘాతం కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్టు అధికారులు గుర్తించారు.

About Kadam

Check Also

అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఇంత దారుణమా.. ఏకంగా 10 మందితో కలిసి..

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమని గట్టిగా అడిగినందుకు ఒక వ్యక్తి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *