ఆఫ్ట్రాల్ ఏసీ టెక్నిషియన్ అనుకోకండి.. ఇంత పెద్ద టాలీవుడ్‌ను షేక్ చేశాడు

సినిమా రిలీజ్‌య్యే రోజే టెలిగ్రామ్‌ గ్రూపుల్లో లీక్ చేస్తున్న కిరణ్‌కుమార్‌ను హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 65కు పైగా సినిమాలను పైరసీ చేసిన అతడు, ఒక్కో సినిమాకు 300 డాలర్లు వసూలు చేసేవాడిగా తేలింది. క్రిప్టో కరెన్సీలో కమిషన్లు తీసుకుంటూ నెలకు లక్షలోపల సంపాదించేవాడని అధికారులు వెల్లడించారు. ఫిలిం ఛాంబర్ ఫిర్యాదుతో పట్టుబడ్డ కిరణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది.

తెలుగు చిత్రసీమను వణికిస్తున్న పైరసీ మాఫియాలో కీలక నిందితుడైన కిరణ్‌కుమార్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఏపీకి చెందిన నిందితుడు.. గతంలో ఏసీ టెక్నీషియన్‌గా పని చేస్తూ వెండితెరపై విడుదలవుతున్న సినిమాలను ఫోనుతో రికార్డ్ చేసి టెలిగ్రామ్‌ గ్రూపుల్లో షేర్ చేసే స్కామ్‌లోకి దిగాడు.

సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కిరణ్ ఇప్పటివరకు 65కి పైగా సినిమాలను పైరసీ చేశాడు. సినిమా విడుదలైన తరువాత రోజే టెలిగ్రామ్‌లో లీక్ చేస్తూ ఒక్కో సినిమాకు 300 డాలర్లు వసూలు చేసేవాడు. క్రిప్టో కరెన్సీ రూపంలో కమిషన్లు తీసుకుంటూ… నెలకు రూ.80 వేల వరకు సంపాదించేవాడు. ఈ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ యాంటీపైరసీ సెల్ ప్రతినిధి మణీంద్రబాబు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి.. కిరణ్‌ను అరెస్ట్ చేశారు.

తెలుగు ఫిలించాంబర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాది పైరసీ వల్ల ఇండస్ట్రీకి దాదాపు రూ.3,500 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. 2019 నుంచే ఈ పని చేస్తూ వస్తున్న కిరణ్‌కు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వందల మంది కష్టంతో కోట్లు పెట్టి నిర్మిస్తున్న సినిమాలను పైరసీ చేస్తోన్న ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ డిమాండ్ చేస్తోంది.

About Kadam

Check Also

నిరుద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్.. త్వరలోనే 5 జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయ్!

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్ల (డిప్యూటీ ఈఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *