రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఈఏపీసెట్ కౌన్సెలింగ్ మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ మేరకు ఇప్పటికే కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. నిజానికి తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ జులై 17 నుంచి ప్రారంభంకావల్సి ఉంది. అయితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఈఏపీసెట్ కౌన్సెలింగ్ మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ మేరకు ఇప్పటికే కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం జులై 7 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టనున్నట్లు సెట్ కన్వీనర్ గణేష్ కుమార్ వెల్లడించారు. మొదట జులై 17 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రకటించారు. జులై 17 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ప్రవేశాలు పూర్తి చేయాలని భావించారు. అయితే తెలంగాణలో ఇప్పటికే కౌన్సెలింగ్ మొదలైనందున వారితో పాటే కౌన్సెలింగ్ పూర్తి చేసేందుకు షెడ్యూల్‌లో మార్పులు చేశారు.
ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను జులై 5న ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రకటన విడుదల చేయనున్నారు. మొత్తం మూడు విడతల్లో ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తొలి విడత రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపులను జులై 7 నుంచి 16వ తేదీ వరకు అవకాశం ఇస్తారు. బ్రాంచీలు, వెబ్‌ఐచ్ఛికాల నమోదుకు జులై 10 నుంచి 18 వరకు అవకాశం ఉంటుంది. జులై 19న ఐచ్ఛికాల మార్పు చేసుకోవచ్చు. జులై 22న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు జులై 23 నుంచి 26వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 4వ తేదీ నుంచి అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో తరగతులు మొదలవుతాయి. కాగా ఈ ఏడాది నిర్వహించిన ఈఏపీసెట్ 2025 ఇంజనీరింగ్‌లో 1,89,748 మంది అర్హత సాధించిన సంగతి తెలిసిందే. వీరందరికీ సీట్లు కేటాయించనున్నారు.
సీయూఈటీ యూజీ 2025 ర్యాంకు కార్డులు వచ్చేశాయ్.. డౌన్‌లోడ్ లింక్ ఇదే
కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) యూజీ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. మే 13 నుంచి జూన్ 4వ తేదీ వరకు జరిగిన ఆన్‌లైన్ రాత పరీక్షలకు మొత్తం 13,54,699 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 10,71,735 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.