బత్తాయి పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే జీర్ణ సమస్యలు, అజీర్తితో బాధపడేవారు బత్తాయిని ఎక్కువగా తినకూడదు. గ్యాస్ సంబంధిత సమస్యలు ఉన్నవారిలో పుల్లటి తేన్పులు వచ్చే ప్రమాదముంది. అందుకే.. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
బత్తాయిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం వంటి పోషకాలు పుష్కకలంగా ఉంటాయి. ఇవి.. వివిధ రోగాలు రాకుండా అడ్డుకుంటాయి. నీరసానికి గురైనప్పుడు బత్తాయి జ్యూస్ తాగితే తక్షణ శక్తి వస్తుంది. నీరసం దరిచేరదు. అయితే, బత్తాయి పండ్లను తిన్న తర్వాత కొన్ని ఆహర పదార్థాలు మర్చిపోయి కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంత మంది బత్తాయి తిన్నాక.. టీ, కాఫీలు తాగుతుంటారు. మరికొంత మంది నాన్ వెజ్ లు, ఫ్రైలు కూడా తింటు ఉంటారు. కానీ, ఇలా తినటం సరైనది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నారింజ, కమల, బత్తాయి వంటి సిట్రస్ జాతి పండ్లను తినే విషయంలో కొన్ని నియమాలు గుర్తించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాంటి పండ్లను పరగడుపున తినడం అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. సిట్రస్ పండ్లలో ఉండే ఆమ్ల లక్షణాల వల్ల జీర్ణవ్యవస్థ ప్రభావితం అవుతుందని చెబుతున్నారు.. ఈ ఆమ్ల లక్షణాలు జీర్ణాశయంలోని పై పొరకు ఇబ్బందికరంగా మారతాయి. అందువల్ల గ్యాస్, పొట్ట ఉబ్బరం, అజీర్తి లాంటి పొట్ట సంబంధిత సమస్యలు పెరుగుతాయి. వీటిని రాత్రి తినడం వల్ల గుండెల్లో మంటగా అనిపించి నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. బత్తాయి పండ్లు ఎక్కువగా తినడం వల్ల దగ్గు, అలెర్జీ, జలుబు సమస్యలు వచ్చే ప్రమాదముంది.
బత్తాయి పండ్లు తిన్న వెంటనే కాఫీ,టీ వంటివి తీసుకోవటం వల్ల కడుపులోకి పోయి కొన్నిరసాయనాలు విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి జీర్ణవ్యవస్థ మీద ప్రభావంచూపించి, విషంగా కూడా కొన్ని సందర్భాలలో మారతాయి. బత్తాయి పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే జీర్ణ సమస్యలు, అజీర్తితో బాధపడేవారు బత్తాయిని ఎక్కువగా తినకూడదు. గ్యాస్ సంబంధిత సమస్యలు ఉన్నవారిలో పుల్లటి తేన్పులు వచ్చే ప్రమాదముంది. అందుకే.. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)