అసలుది వదిలి.. మరో గ్రూపు రక్తం ఎక్కించిన వైద్యులు.. ప్రాణం తీసిన సర్కార్ ఆసుపత్రి వైద్య సిబ్బంది..!

కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో దారుణం వెలుగు చూసింది. డయాలసిస్ కోసం వచ్చిన రోగికి ఒక రక్తానికి బదులు మరో గ్రూపు రక్తం ఎక్కించడం వల్ల ఓ మహిళ ప్రాణాల కోల్పోయింది. కాకినాడ జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందింది. కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అనుభవజ్ఞులైన వైద్యులున్నారు. కావాల్సినన్ని మౌలిక సదుపాయాలున్నాయి. కానీ ఇక్కడ ప్రాణం ఖరీదు కేవలం రూ.3 లక్షలు మాత్రమే. కొంతమంది వైద్య విద్యార్థుల అవగాహనా రాహిత్యంతో నిర్లక్ష్యంగా ఒక గ్రూపునకు బదులు మరో గ్రూపు రక్తం ఎక్కించారు. దీంతో ప్రాణాలతో తిరిగి వస్తుందనుకున్న మహిళ ఆ మహిళ ప్రాణాన్ని బలి తీసుకున్నారు.

భావన శిరీష(34) అనే మహిళ కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. దీంతో అమె తల్లి దేవదట్ల పెద్దింట్లు అనే మహిళ అమలాపురంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించింది. వైద్యుల సూచిన మేరకు మెరుగైన వైద్యం కోసం నవంబర్ 4వ తేదీన కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్చించింది. రక్తం తక్కువగా ఉండడంతో ఓ పాజిటివ్ గ్రూప్ ఎక్కించాలని వైద్యులు తెలియజేశారు. దీంతో నమూనాలను తమ బంధువులు జీజీహెచ్ బ్లడ్ బ్యాంకులో ఇచ్చారు. విధుల్లో ఉన్న ఓ హౌజ్ సర్జన్ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం తీసుకు వచ్చి ఆమెకు ఎక్కిస్తుండగా బిగిసిపోయింది. దీంతో ఆమెను గమనించిన బంధువులు ఆరా తీయడంతో అసలు నిజం బయటపడింది.

అదే సమయంలో రోగికి ఆయాసం రావడంతో రియాక్షన్ కాకుండా బీపీకి అనుగుణంగా చికిత్స అందించారు వైద్యులు. ఆక్సిజన్ శాతం పడిపోయి ఆయాసంతో శిరీష మృతి చెందింది. ఈ విషయాన్ని ఆసుపత్రి ఉన్నతాధికారులు వైద్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తప్పు తెలుసుకున్న వైద్యులు నష్టపరిహారంగా రూ 3 లక్షల రూపాయల చెక్కులు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు వైద్య సిబ్బంది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆసుపత్రి సూపరిండెంట్ లావణ్య కుమారి అధికారుల చేతుల మీదగా శిరీష తల్లికి చెక్కును అందజేశారు. విచారణ కమిటీ నియమిస్తామని నివేదిక ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సూపరిండెంట్ అన్నారు.

అయితే ఈ ఘటన ప్రైవేట్ ఆస్పత్రిల మాదిరిగా నష్ట పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వ వైద్యులే ఈ రకమైన ట్రీట్‌మెంట్ చేస్తే ప్రభుత్వాసుపత్రికి సామాన్య ప్రజలు ఎలా వస్తారంటూ విమర్శలు గుపిస్తున్నారు స్థానికులు. చికిత్సలో నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

About Kadam

Check Also

ఆహ ఏం రుచి.! అన్నప్రసాదంలో మరో ఐటెమ్.. శ్రీవారి భక్తులకు పండుగే పండుగ

తిరుమల శ్రీనివాసుడంటే ప్రపంచమంతా ఫేమస్సే.. అందుకే ఆయన దర్శనం కోసం ప్రపంచం నలుమూలలనుంచి రెక్కలు కట్టుకొని వాలిపోతుంటారు. ఒక్క శ్రీవారు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *