రాజధాని నిర్మాణానికి చేతి గాజులు విరాళంగా ఇచ్చిన మహిళ – అభినందించిన సీఎం చంద్రబాబు!

ఎన్నో ఎళ్లుగా ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్న రాజధాని అమరావతి నిర్మాణం సహకారం కానుంది. రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం నిర్మాణపునులను వేగంగా పూర్తి చేస్తుంది. అయితే రాజధాని నిర్మాణంలో తాము పాలుపంచుకుంటామని కొందరు ఏపీ ప్రజలు ముందుకొస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం తమ వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలు సీఎం చంద్రబాబును కలిశారు. రాజధాని నిర్మాణానికి తమ వంతు సాయంగా వారి చేతి గాజులను విరాళంగా ఇచ్చారు.

సచివాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబును కలిసిన తెనాలి, విజయవాడకు చెందిన ఇద్దరు మహిళలు 4 చేతి గాజులు, నగదును విరాళంగా ఇచ్చారు. తెనాలికి చెందిన నన్నపనేని ఉదయలక్ష్మీ 36 గ్రాముల 546 మిల్లీగ్రాముల బంగారు గాజులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. నాలుగు బంగారు గాజులతో పాటు మరో రూ.1 లక్ష చెక్కును విరాళంగా అందించారు. రాజధాని నిర్మాణానికి ఈ మొత్తాన్ని వెచ్చించాలని కోరారు. అదేవిధంగా విజయవాడకు చెందిన వెలగపూడి చంద్రావతి అనే మహిళ రూ.50 వేలు విరాళం ఇచ్చారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలనే మంచి ఆలోచనతో ముందుకొచ్చిన మహిళలను సీఎం చంద్రబాబు అభినందించారు. వీరి ఔదార్యం, ఉదారత ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.

About Kadam

Check Also

అంతా దైవ మహత్యమే.. అకస్మాత్తుగా గుడి ముందు ప్రత్యక్షమైన దేవుడి విగ్రహాలు.. చిన్న కథ కాదు..

ఆంధ్రప్రదేశ్‌ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు మండలం గారపాడులో స్థానికులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.  అందరూ అంత సంతోషం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *