‘ట్రాఫిక్ చలాన్లు కాదు.. ముందు మీరు టాక్స్ కట్టండి..’ ఓ యువకుడి వింత నిరసన!

బైక్‌పై వెళ్తే నిబంధనల పేరుతో ఫైన్ వేస్తున్నారు. అన్ని రకాల టాక్సులు వసూలు చేస్తున్నారు. కానీ.. రోడ్డు మరమ్మతులు చేయడం లేదంటూ ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏకంగా నడిరోడ్డుపై గుంతలో కూర్చొని నిరసన తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కరీంనగర్‌లోని రేకుర్తి చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అధ్వాన్నంగా మారిపోయింది. కరీంనగర్ నుండి నిజామాబాద్ నేషనల్ హైవే అయినప్పటికీ అధికారులు గాని, పొలిటికల్ లీడర్స్ గాని ఎవరూ పట్టించుకోవడం లేదని కరీంనగర్‌కు చెందిన కోట శ్యామ్ కుమార్ నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు బాగా లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని శ్యామ్ కుమార్ వాపోయారు. రోడ్డుపై వాహనం నడపాలంటేనే భయం వేస్తుందన్నారు. మరోవైపు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని పోలీసులు ఫైన్‌ల రూపంలో జరిమానాలు కట్టిస్తున్నారన్నారు. GST లు, రోడ్డు టాక్స్ కడుతున్నాను కానీ, అసలు రోడ్లే సరిగా లేవని శ్యామ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే అధ్వాన్నంగా తయారైన రోడ్డుకు మరి మీరు నాకెంత ఫైన్ కడతారు అని కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్‌ను ప్రశ్నించారు. ముందుగా రోడ్లు నిర్మించి.. తరువాత ఫైన్ లు వసూలు చేయాలని డిమాండ్ చేశాడు. ఈ రోడ్డు కారణంగా చాలా మంది ప్రమాదాలకు గురువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలని వేడుకున్నారు శ్యామ్ కుమార్.

About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *