హైదరాబాద్‌లో స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది అవినీతి నిరోధక శాఖ. 18 బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. విద్యుత్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. అందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
మణికొండలో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న అంబేద్కర్ నివాసం, ఆయన బంధువుల నివాసాలతోపాటు ఆయన విధులు నిర్వహిస్తున్న కార్యాలయంలో సైతం సోదాలు చేపట్టారు. ఉదయం 5గంటల నుంచి నగర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. పెద్దఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారన్న సమాచారంతో మణికొండలో విద్యుత్‌శాఖ అడిషనల్ డివిజనల్ ఇంజినీర్ అంబేద్కర్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టు ADE అంబేద్కర్‌పై గతంలోనే ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. ADE అంబేద్కర్ నివాసం, ఆఫీస్‌తోపాటు బంధువుల ఇళ్లల్లోనూ ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.
Amaravati News Navyandhra First Digital News Portal