ఏంటి చెల్లమ్మా ఇలా చేశావ్.. ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడింది.. కట్ చేస్తే, ఊహించని పని..

ఆన్లైన్ బెట్టింగ్, క్యాసినో కు అలవాటు పడింది.. అప్పులు చేసి.. మరి ఆట ఆడింది.. కానీ.. ఫుల్లుగా డబ్బులు పోయాయి.. ఏం చేయాలో అర్థం కాలేదు.. అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేసింది.. అలా చూస్తుండగానే.. 5 లక్షల వరకు అప్పుల పాలైంది.. ఇక చేసిన అప్పులను తీర్చేందుకు తన సొంత అన్న ఇంట్లోనే చోరి చేయించింది.. చివరకు అసలు విషయం తెలియడంతో కటకటాల పాలైంది.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట గాజులరామారం షిరిడి హిల్స్‌లో నివసించే సుబ్రమణ్యం శ్రీకాంత్ ప్రతి శనివారం కర్మాన్‌ఘాట్ లోని తన తండ్రి ఇంటికి వెళుతూ ఉండేవాడు. అక్కడే తన భర్త నుండి వేరుపడి ఉంటున్న తన చెల్లి కూడా ఉండేది. ఆమె ఆన్లైన్ బెట్టింగులు, క్యాసినోలు ఆడి 5 లక్షల రూపాయలు అప్పులు చేసింది. శ్రీకాంత్ కు ఆయన చెల్లికి కుటుంబ కలహాలు ఉన్నాయి.

ఈ క్రమంలో తన అన్న ఇంట్లో ఉండే బంగారాన్ని అపహరించి తన అప్పులు తీర్చుకోవాలని, తన స్నేహితులు అఖిల్, కార్తీక్ తో కలిసి ఆమె పన్నాగం పన్నింది. ఈనెల 5వ తేదీన శ్రీకాంత్ కుటుంబ కర్మాన్ ఘాట్‌కి వెళ్ళగా, ముందుగానే పన్నిన పథకం ప్రకారం శ్రీకాంత్ భార్యకు తెలియకుండా ఆమె పర్సులోని ఇంటి తాళాలు తీసి అదే రాత్రి అఖిల్ కార్తీక్ లకు శ్రీకాంత్ చెల్లి అందజేసింది. వారు ఆ ఇంటి తాళం చెవులను తీసుకొని శ్రీకాంత్ ఇంటికి వచ్చి 12 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు అపహరించారు..

అనంతరం తిరిగి కర్మాన్ ఘాట్ వెళ్లి శ్రీకాంత్ చెల్లి చెప్పిన షూర్యాక్ లో తాళం చెవులు దాచి ఉంచి వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చిన శ్రీకాంత్ ఇంట్లో చోరీ అయిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జగద్గిరిగుట్ట నుండి కర్మాన్‌ఘాట్ వరకు సీసీ కెమెరాలు పరిశీలించి చోరీకి పాల్పడింది శ్రీకాంత్ చెల్లెలు ఆమె స్నేహితులు అఖిల్, కార్తీక్ అని గుర్తించారు.

అనంతరం వారిని అరెస్ట్, చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుండి చోరీకి గురైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, చోరీకి ఉపయోగించిన ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నామని జగద్గిరిగుట్ట సీఐ నరసింహ తెలిపారు.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *