బహిరంగ క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే.. ఎందుకంటే!

ఇంటింటికి పార్థసారథి కార్యక్రమంలో భాగంగా ఈనెల 16న కర్నూలు జిల్లా ఆదోని మండలం దానాపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో దళిత సర్పంచ్ చంద్రశేఖర్‌ను అవమానించాననే ఆరోపణలపై ఎమ్మెల్యే పార్థసారథి స్పందించారు. తానకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని.. తెలియకుండా తానేవరినైనా బాధపెట్టి ఉంటే బహిరంగ క్షమాపణలు చెబుతున్నాని ఆయన అన్నారు.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఆదోని నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు పార్థసారథి. ఈ క్రమంలో ఈయన తాజగా ఇంటింటికి పార్థసారథి అనే కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 16న కర్నూలు జిల్లా ఆదోని మండలం దానాపురంలో పర్యటించారు ఎమ్మెల్యే పార్థసారథి. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్‌ను వేదికపైకి ఆహ్వానించారు. ఈ క్రమంలో అతను క్రిస్టియన్, లేదా బిసి అని ఆరా తీశారు. అది విన్న చంద్రశేఖర్ వేదిక వీదకు వెళ్లకుండా అక్కడే ఆగిపోయారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఆదోని టిడిపి మాజీ ఇంచార్జి గుడిసె కృష్ణమ్మ కలుగజేసుకొని.. సర్పంచ్ చంద్రశేఖర్ ఎస్సీ అని ఎమ్మెల్యే కి సమాచారం ఇచ్చారు.

దీంతో అప్పటికే వేదిక దగ్గరికి వచ్చిన సర్పంచ్ చంద్రశేఖర్‌ను ఎమ్మెల్యే వేదిక మీదకు ఆహ్వానించకపోవడంతో.. సర్పంచ్‌ చంద్రశేఖర్ అక్కడే ఉండిపోయారు. అయితే సర్పంచ్‌ కులం గురించి ఎమ్మెల్యే పార్థసారథి, టిడిపి మహాళా నేత కృష్ణమ్మ మధ్య జరిగిన సంభాషణ అంతా అక్కడున్న కెమెరాల్లో రికార్డయింది. అది కాస్తా తర్వాత టీవీలు, పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రచారమైంది. దీంతో ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సంఘాల నేతలు ఎమ్మెల్యే పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి.

దీంతో ఈ సంఘటనపై ఎమ్మెల్యే పార్థసారథి స్పందించారు. తనకు సర్పంచ్‌ చంద్రశేఖర్‌ను కించపరచాలని ఉద్దేశం ఏమాత్రం లేదని, ముఖ్యంగా దళితులంటే తను చాలా గౌరవం అని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. తాను సర్పంచ్‌ చంద్రశేఖర్‌ను అవమానపరిచినట్లు వారు భావిస్తే.. బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు.

About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *