రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు అన్నింటికీ ఇక కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇంటర్నెట్ సదుపాయం రానుంది. ఈ మేరకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. తాజాగా పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలపై మంత్రి లోకేషన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ను పునర్ వ్యవస్థీకరించి, నిపుణులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే బోర్డు మీటింగ్ నిర్వహించి, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్టెమ్ కార్యకలాపాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అలాగే నైపుణ్య పోర్టల్‌ను సెప్టెంబరు ఒకటి నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకోష్ అన్నారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి పోస్టును జిల్లా ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి అధికారిగా మార్చాలన్నారు. వీరి ఆధ్వర్యంలో జాబ్ మేళాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని చెప్పారు. అలాగే నైపుణ్య శిక్షణతో విదేశాల్లోనూ మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారికి ఇబ్బందులు తలెత్తకుండా సహాయ మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. వీరికి ఏదైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్‌లైన్ నంబరు 0863-2340678కు ఫోన్ చేయాలని, లేదంటే వాట్సప్ నంబరు 85000 27678 ద్వారా సంప్రదించాలని సూచించారు.
నేటితో ముగుస్తున్న ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ఎండీఎస్ సీట్ ఐచ్ఛికాల ఎంపిక
2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని దంత వైద్య కళాశాలల్లో పీజీ దంత వైద్య (ఎండీఎస్) కన్వీనర్, యాజమాన్య సీట్ల భర్తీకి ఐచ్ఛికాల ఎంపిక గడువు నేటితో ముగియనున్నట్లు విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. కన్వీనర్ కోటా సీట్లకు జులై 14 నుంచి ఐచ్ఛికాలు మొదలుకాగా జులై16వ తేదీ మధ్యాహ్నం ఒంటి వరకు అవకాశం ఇచ్చింది. ఇక యాజమాన్య కోటా సీట్లకు జులై 15 నుంచి జులై 17వ తేదీ మధ్యాహ్నం ఒంటి వరకు ఐచ్ఛికాల ఎంపిక గడువు ఇచ్చింది.