హైకోర్టులోనూ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. చంచల్‌గూడ జైలుకు..

సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పుష్ప సినిమా ప్రీమియర్స్ సమయంలో అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో ఒక్కసారిగా అభిమానులు భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టుకు రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో అల్లు అర్జున్ ను చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. 12గంటల 15నిమిషాలకు జూబ్లీహిల్స్‌ నివాసంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఆయన సతీమణి స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.

ఇరు వైపులా వాదనలు విన్న కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే ముందస్తు బెయిల్ కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటీషన్ వేశారు. హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు అల్లు అర్జున్. ఈ క్రమంలో కోర్టులో వాడివేడిగా అర్గ్మెంట్ జరిగింది. ముందుగానే పోలీసులకు థియేటర్ యాజమాన్యం లేఖ రాసిందని అల్లు అర్జున్ తరపు లాయర్ వాదిస్తున్నారు. కాగా లేఖ రాసినప్పటికీ ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. అలాగే థియేటర్ కు వెళ్ళడానికి  సినిమా నటుడు, అనుమతి తీసుకునాడు కదా, అనుమతి తీసుకున్నప్పటికీ, హీరో హీరోయిన్ లను థియేటర్ కు పిలవద్దు అని పోలీసులు థియేటర్ యాజమాన్యం కు లేఖ రాశారని జిపి తెలిపారు.

About Kadam

Check Also

 అద్దె ఇంటి కోసం వచ్చి.. ఎంత పని చేశారు.. వామ్మో మీరు జాగ్రత్త!

ఇంట్లో అద్దెకు దిగుతున్నట్లు నటించిన దొంగలు, బంగారం, నగదు కోసం ఇంటి యాజమానులైన వృద్ధ దంపతులను హతమార్చారు.ఖమ్మం జిల్లా వృద్ధ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *