12గంటల 15నిమిషాలకు జూబ్లీహిల్స్ నివాసంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఆయన సతీమణి స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. చంచలగూడా జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు పోలీసులు. ఏ 11 కి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ,7 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పుష్ప సినిమా ప్రీమియర్స్ సమయంలో అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో ఒక్కసారిగా అభిమానులు భారీగా చేరుకోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కొడుకు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరాడు. అదృష్టం కొద్దీ ఆ బాలుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడ్డాడు.కాగా తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని పోలీసులు ఆరోపిస్తున్నారు.
అల్లు అర్జున్‌ను ఆయన ఇంటి దగ్గర అరెస్ట్ చేయడం మొదలు ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచడం వరకు అంతా ఉత్కంఠనడుమ కొనసాగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మరోవైపు అల్లు అర్జున్ వ్యవహారంపై తెలంగాణ సీఎం రియాక్ట్ అయ్యారు. చట్టం ముందు అంతా సమానమే అని.. ఈ వ్యవహారంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని అన్నారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని తెలిపారు.