ప్రశ్నల వర్షం.. అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్న పోలీసులు

అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్నారు. సంద్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు పోలీసులు. పుష్ప 2 విడుదల సందర్భంగా సంద్యథియేటర్ కు సినిమా చేసేందు వెళ్లారు అల్లు అర్జున్. ఆ సమయంలో ఆయనను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున అక్కడికి వచ్చారు. దాంతో తొక్కిసలాట జరిగింది.

  • అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై ప్రశ్నలు..అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటన పై స్పందించిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. దాని పై కూడా పోలీసులు ప్రశ్నలు అడుగుతున్నారు పోలీసులు
  • పోలీసులు సంధిస్తున్న ప్రశ్నలు ఇవే ..
  • – థియేటర్‌కి వస్తున్నట్టు మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు..?
  • – రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా?
  • – పర్మిషన్ నిరాకరించినట్టు మీకు ఎవరూ చెప్పలేదా?
  • – మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్‌కు వచ్చారు?
  • – రేవతి చనిపోయిన సంగతి మీరు థియేటర్లోనే ఉన్నపుడు తెలియదా?
  • – ఏసీపీ, సీఐ మిమ్మల్ని కలిసింది నిజం కాదా?
  • – మీతో వచ్చిన బౌన్సర్లు ఎంతమంది? ఎక్కడి నుంచి వచ్చారు?
  • – అభిమానుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలు ఏంటి?
  • – ప్రెస్‌మీట్‌లో మీరు చెప్పిన విషయాలపై వివరణ ఏంటి?
  • – ఓ మహిళ చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది?
  • – మీరు 2:45 గంటలు థియేటర్‌లో ఉన్నది వాస్తవం కాదా?
  • – 850 మీటర్లు ఎందుకు రోడ్‌షో చేశారు?
  • – వెళ్లేటప్పుడు మళ్లీ అభివాదం ఎందుకు చేయాల్సి వచ్చింది..?
  • అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు..అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు పోలీసులు. అసలు సంధ్య థియేటర్ లో జరిగిన సంఘటనను వివరంగా తెలుసుకుంటున్న పోలీసులు..

అల్లు అర్జున్ పోలీసులు ముందు హాజరయ్యారు. నిన్న అల్లు అర్జున్ కు నోటీసులు పంపారు పోలీసులు. సంద్యథియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసిన చేశారు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ సందడి చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. దాంతో అల్లు అర్జున్ బౌన్సర్లు జనాలను వెనక్కి నెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. అలాగే ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ను ఏ 11గా చేర్చారు.

తాజాగా అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాంతో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ  విచారణలో పోలీసులు సంధ్య థియేటర్ లో జరిగిన సంఘటన గురించి అల్లు అర్జున్ ను ప్రశ్నించనున్నారు. అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా స్టేషన్ కు వచ్చారు. అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నారు పోలీసులు.

About Kadam

Check Also

బ్రదరూ.! బీ కేర్‌ఫుల్.. 90 రోజుల్లో పెండింగ్ చలాన్లు కట్టకపోతే ఇకపై వెహికల్స్ సీజ్

ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు విషయంలో హెల్మెట్స్ పెట్టుకోకపోవడమే కారణం కావడంతో సీరియస్ అయిన హైకోర్టు.. పోలీసులకు కీలక ఆదేశాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *