అతి సామాన్య నేత.. సాదాసీదాగా జీవిస్తున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఇకలేరు..!

కర్నూలు జిల్లా ఆలూరు మాజీ శాసనసభ లోక్‌నాథ్ ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందారు. హైదారాబాద్ మల్లారెడ్డి ఆసుపత్రిలో బుధవారం(ఏప్రిల్ 16) మధ్యాహ్నం చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతకకాయాన్ని సొంత గ్రామం ఆలూరు మండలం మొలగవళ్లి గ్రామానికీ తీసుకొనే వచ్చే పనిలో కుటుంబ సభ్యులు ఉన్నారు. లోక్ నాథ్ మరణవార్త వినిన వెంటనే తన సొంత గ్రామం మొలగవల్లి అలాగే ఆలూరు లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

లోక్‌నాథ్ మొలగవళ్లి గ్రామంలో విద్యను అభ్యసించారు. అప్పట్లోనే ఓల్డ్ SSLC వరకు చదువుకున్నారు. ఉన్నత విద్య కోసం ఉమ్మడి మద్రాస్ గవర్నమెంట్‌లోనే బళ్లారికి వెళ్ళి చదువుకోవాలని భావించారు. ఆర్థిక ఇబ్బందుల్లో చదువుకు దూరమయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి చొరవతో రాజకీయాల లోకి వచ్చిన లోక్‌నాథ్ 1989లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కోట్ల విజయ భాస్కర రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెసు పార్టీ తరపున ఆలూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కొన్ని కారణాల రీత్యా కొన్ని రోజులు పార్టికి దూరంగా ఉన్నారు.. తిరిగి పార్టీ లో ఎదుగుతూ వచ్చారు.

మొలగవళ్లి గ్రామంలో నాగమ్మ దేవప్ప పెద్ద కుమారుడు లోక్ నాథ్. ఆయన సోదరులు ఐదుగురు ఒక చెల్లి. MLA గా లోక్ నాథ్ గెలిచినప్పటి నుంచి అద్దె ఇంట్లోనే నివాసం. ఆలూరులో సొంత సైకిల్ కానీ, సొంత బైక్ కు కానీ లేని MLA ఎవరంటే ఒకే ఒక లోక్ నాథ్ అనే చెప్పాలి. మృతుడు లోక్ నాథ్ కు భార్య నలుగురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. ప్రస్తుతము మొలగవళ్లి గ్రామ సర్పంచ్ లోక్ నాథ్ సోదరుడు మోహన్ రావు.

గురువారం(ఏప్రిల్ 17) అధికారకంగా మాజీ ఎమ్మెల్యే లోక్‌నాథ్ అంత్యక్రియలు మొలగవళ్లి గ్రామంలో జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నిస్వార్థంగా పనిచేసే మంచి MLA లోక్ నాథ్ ను కోల్పోవడం చాలా బాధకరమని గ్రామస్థులు సన్నిహితులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. లోక్‌నాథ్ అంత్యక్రియలకు ప్రముఖులు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

About Kadam

Check Also

ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్ ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు జూన్‌ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *