ఈ నీరు అమృతం కన్నా పవర్‌ఫుల్.. ఉదయాన్నే పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

మెంతికూర సహాయంతో మనం అనేక రకాల రోగాలను నయం చేసుకోవచ్చు.. మెంతులలో ప్రొటీన్, టోటల్ లిపిడ్, ఎనర్జీ, ఫైబర్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మెంతి నీరు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..? ఎప్పుడు తాగాలి.. ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. వాటికి చెక్ పెట్టేందుకు మంచి జీవనశైలిని అనుసరించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం.. అలాంటి ఆహార పదార్థాలలో మెంతులు ఒకటి.. మెంతులను మసాలా దినుసుగా.. భారతీయ గృహాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు.. మెంతులతోపాటు.. ప్రజలు మెంతికూరను కొన్నిసార్లు కూరగాయలలో, కొన్నిసార్లు పరాటాలలో కలిపి తింటారు.. ఇంకా మెంతులతో లడ్డూలు కూడా తయారు చేసుకుని తింటారు.. అయితే.. మెంతులు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనలోని కొంత మందికి చాలా తక్కువ తెలుసు. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, మెంతులు అనేక రకాల విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి.. ఇవి శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉండటంతోపాటు.. మేలు చేస్తాయి.

ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. మెంతులు, మెంతికూర సహాయంతో మనం అనేక రకాల వ్యాధులను నయం చేయవచ్చు. మెంతులలో ప్రోటీన్, టోటల్ లిపిడ్, ఎనర్జీ, ఫైబర్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, జింక్, మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ బి, సోడియం, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు ఉంటాయి.

కాబట్టి మెంతి నీరు త్రాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి..? దానిని ఎప్పుడు తాగాలో తెలుసుకోండి..

ఖాళీ కడుపుతో మెంతి నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది: మెంతి నీరు శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. రోజూ ఉదయాన్నే మెంతికూర నీరు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది: జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి మెంతి నీరు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది పొట్టను శుభ్రపరుస్తుంది. ఈ నీటిని తాగడం వల్ల మలబద్ధకం, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది.

బరువు తగ్గడంలో ప్రభావవంతంగా ఉంటుంది: మెంతులు బరువు తగ్గడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. నిత్యం మెంతికూర, మెంతి నీళ్లు తాగితే ఊబకాయం త్వరగా తగ్గుతుంది. దీని కోసం ఈ మెంతులను బాగా నమలి తినండి.. దీని ప్రభావం త్వరలోనే కనిపిస్తుంది.

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం..

మెంతి గింజల నీరు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డయాబెటిస్ లో కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా మీరు దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే చాలా మంచిది.. మెంతి నీటిని తయారు చేయడానికి ఒక గ్లాసు నీటిలో ఒకటి నుంచి ఒకటిన్నర టీస్పూన్ మెంతి గింజలను రాత్రంతా నానబెట్టండి. ఉదయం నిద్ర లేవగానే ఈ నీటిని బాగా వడపోసి ఖాళీ కడుపుతో తాగాలి. కావాలనుకుంటే మెంతి గింజలను తర్వాత తినవచ్చు.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతి నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. మెంతులు వేడిగా ఉంటాయి.. కాబట్టి గర్భిణీ స్త్రీలు వైద్య సలహా మీద మాత్రమే దానిని తీసుకోవాలి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

About Kadam

Check Also

PMO, పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటు చేయబోతున్న వేద గడియారం.. దీని ప్రత్యేకమేంటంటే

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఆధునిక వేద గడియారాలు తయారవుతున్నాయి. ఇవి హిందీ, ఇంగ్లీషులో మాత్రమే కాకుండా 189 భాషలలో సమయాన్ని తెలియజేస్తాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *