ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరో ఆకర్షణీయమైన సేల్‌తో వినియోగదారులను ఆకర్షించే పనిలో పడింది. బ్లాక్ ఫ్రైడే సేల్ పేరుతో ఆకట్టుకునే ఆఫర్లను ప్రకటించింది. ఇంతకీ ఈ సేల్‌లో భాగంగా లభిస్తున్న ఆఫర్లు ఏంటి.? ఏయే వస్తువులపై ఎలాంటి డిస్కౌంట్స్ లభించనున్నాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బ్లాక ఫ్రైడే సేల్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అగ్రరాజ్యం అమెరికా. షాపింగ్ సీజన్ ప్రారంభానికి సూచికగా ఏటా బ్లాక్ ఫ్రైడే్ పేరుతో సేల్‌ను నిర్వహిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ సేల్‌ను భారత్‌లోనూ నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ భారత్‌లో కూడా ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ ఏడాదికి గాను నవంబర్ 29వ తేదీ నుంచి అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ పేరుతో ఆఫర్లు అందిస్తున్నారు.
డిసెంబర్ 2వ తేదీ వరకు కొనసాగనున్న ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు, అన్ని రకాల గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ల్యాండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులకు చెందిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభించనుంది. ఇక ప్రైమ్ మెంబర్స్‌కి అదనంగా డిస్కౌంట్ అందించనున్నారు.
ప్రైమ్ మెంబర్స్ అమోజాన్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 5శాతం అదనంగా క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. సేల్‌లో భాగంగా కొన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై ఏకంగా 75 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఐఫోన్ 15 సిరీస్ మొదలు, సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23 ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నారు. అలాగే ఈ సేల్‌లో వాషింగ్ మిషిన్స్‌పై కూడా మంచి డిస్కౌంట్స్ అందిస్తున్నారు.
సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23 అల్ట్రా 5జీ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 1,24,999 కాగా ప్రస్తుతం బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా రూ. 74,999కే సొంతం చేసుకునే అవకాశం లభించింది. అలాగే యాపిల్, ఐక్యూ, వన్‌ప్లస్, రియల్ మీ, రెడ్‌మీ, టెక్నో ఫోన్‌లపై 40 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇక యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ (ఎం1, 2020) ల్యాప్‌టాప్ ధర రూ.89,900 కాగా.. ఆఫర్‌లో భాగంగా రూ.59,990కే సొంతం చేసుకోవచ్చు.