పిట్ట కొంచెం.. కూత ఘనం.. 17 నెలల చిన్నారి ట్యాలెంట్‌ చూస్తే మతిపోవాల్సిందే!

పిట్ట కొంచెం..కూత ఘనం అన్నట్టు ఒంగోలు పట్టణంలోని సత్యనారాయపురంకి చెందిన 17 నెలల చిన్నారి అంబటి ఖశ్వి ఏకంగా ప్రపంచ రికార్డు సాధించింది. కేవలం 17 నెలలు వయస్సులోనే 24 వేర్వేరు కేటగిరీలలో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను మాట్లాడి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.

ఒంగోలు పట్టణంలోని సత్యనారాయపురంకి చెందిన 17 నెలల వయస్సున్న అంబటి ఖశ్వి ప్రపంచ రికార్డు సాధించింది. కేవలం 17 నెలలు వయస్సులోనే 24 వేర్వేరు కేటగిరీలలో 650కి పైగా ఇంగ్లీష్ పదాలను మాట్లాడగలగడం ద్వారా “నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్” లో స్థానం దక్కించుకుంది అంబటి ఖశ్వి. ఇది చిన్నారుల విభాగంలో ప్రపంచస్థాయిలో అత్యుత్తమ రికార్డుగా గుర్తింపు పొందింది. గతంలో ఉన్న రికార్డును నాలుగు సంవత్సరాల మూడు నెలల చిన్నారి 300 పదాలు మాట్లాడిన ఘనతను అంబటి ఖస్వీ అధిగమించడం విశేషం. ఈ సందర్బంగా ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ దామోదర్ చిన్నారి అంబటి ఖశ్వి ని ప్రత్యేకంగా అభినందించారు.

అంబటి ఖశ్వి ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైన ఘనతను సాధించిందని, కేవలం జిల్లాకే కాకుండా రాష్ట్రానికి కూడా గర్వకారణమని ప్రకాశంజిల్లా ఎస్‌పి దామోదర్‌ తెలిపారు. చిన్న వయస్సులోనే ఇటువంటి మేధస్సు ప్రదర్శించడం అద్భుతమైన విషయమన్నారు. చిన్నారుల్లో తెలివితేటలు, ప్రతిభను గుర్తించాలన్నారు. ఈ విజయం సాధించడంలో కుటుంబ సభ్యుల సహకారం, మార్గదర్శకత ఎంతో ముఖ్యమైందని తల్లిదండ్రులను అభినందించారు. జిల్లా పోలీస్ శాఖ తరఫున అంబటి ఖశ్వి భవిష్యత్తు మరింత వెలుగులు విరచిమ్మాలని జిల్లా ఎస్పీ దామోదర్‌ ఆకాంక్షించారు… ఈ కార్యక్రమంలో చిన్నారి తల్లిదండ్రులు సాయికుమార్, ప్రణతి, తాతయ్య ,నానమ్మలు శివాజీ గణేష్, కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.

About Kadam

Check Also

అంతా దైవ మహత్యమే.. అకస్మాత్తుగా గుడి ముందు ప్రత్యక్షమైన దేవుడి విగ్రహాలు.. చిన్న కథ కాదు..

ఆంధ్రప్రదేశ్‌ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు మండలం గారపాడులో స్థానికులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.  అందరూ అంత సంతోషం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *