పహల్గామ్‌ ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం… లోక్‌సభలో విపక్షాలపై అమిత్‌షా విసుర్లు

పహల్గామ్‌లో పర్యాటకులను హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా లోక్‌సభలో ప్రకటించారు. ఆపరేషన్‌ సింధూర్‌పై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. టూరిస్టులను ఉగ్రవాదులు కిరాతకంగా హత్యచేశాని అన్నారు అమిత్ షా. కుటుంబాల ముందే పర్యాటకుల్ని దారుణంగా చంపారు. మతం పేరు అడిగి మరీ చంపడం దారుణం అన్న అమిత్‌ షా… పహల్గామ్‌ ప్రతీకారాన్ని ధృవీకరించారు. ఆపరేషన్‌ మహాదేవ్‌లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను బద్రతా బలగాలు మట్టుబట్టాయని స్పష్టం చేశారు. ఈనెల 22న సెన్సార్ల ద్వారా ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించారు. బైసరస్‌, లిడ్వస్‌లో ఒకే రకమైన ఆయుధాలను ఉగ్రవాదులు వాడినట్లు భద్రతా దళాలు గుర్తించినట్లు అమిత్‌షా తెలిపారు.

ఆపరేషన్‌ సింధూర్‌తో ఉగ్ర శిబిరాలను మట్టిలో కలిపేసి ప్రతీకారం తీర్చుకున్నామని అమిత్‌షా వెల్లడించారు. ఉగ్రదాడి జరిగిన రోజునే జమ్ము భద్రతపై సమీక్షించానని చెప్పారు. పహల్గామ్‌ దాడి ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌, జమ్ము పోలీసులకు అభినందనలు తెలిపారు అమిత్‌షా. ఈ నెల 22న శాటిలైట్‌ ఫోన్‌ సిగ్నల్‌ ద్వారా గ్రవాదుల ఆచూకీ తెలిసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినవారిని కూడా అరెస్ట్ చేశామన్నారు హోంమంత్రి అమిత్‌షా.

ఉగ్రవాదులను అంతమొందించామని చెప్పగానే విపక్షాలు ఆనందం వ్యక్తం చేస్తాయనుకున్నా. కానీ, కానీ విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయని అమిత్‌షా విమర్శించారు. ఉగ్రవాదులు చనిపోయారన్న సంతోషం కూడా విపక్షాలకు లేదని అమిత్‌ షా ఆరోపించారు.

About Kadam

Check Also

మీరూ బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా? టి-శాట్‌లో స్పెషల్‌ డిజిటల్‌ కంటెంట్‌ మీకోసమే..

ప్రభుత్వ ఉద్యోగాలు, పాఠశాల విద్య వంటి అంశాలపై డిజిటల్‌ కంటెంట్‌ అందించేందుకు టి-శాట్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లు ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *