ఏపీలో సంక్రాంతి సెలవుల లిస్ట్ వచ్చేసిందోచ్..

ఏపీలో సంక్రాంతి సెలవులపై కన్‌ఫ్యూజన్ నెలకొన్న క్రమంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి 11–15 లేదా జనవరి 12–16 వరకు సెలవులు కుదిరిస్తున్నారన్న ప్రచారంలో నిజం లేదని తెలిపింది. సెలవులు అధికారిక అకడమిక్ పాఠశాల క్యాలెండర్‌ ప్రకారమే ఉంటాయని ప్రభుత్వం ధృవీకరించింది. హాలిడేస్ ఏ తేదీల్లో ఉంటాయో తెలుసుకుందాం పదండి…

ఆంధ్రాలో సంక్రాంతి పండుగ ఎంత గొప్పగా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి వస్తే.. హైదరాబాద్‌లో సగం సిటీ ఖాళీ అవుతుంది. సెటిలర్స్, జాబ్స్ నిమిత్తం నగరంలో ఉండేవారు అంతా సొంత ఊర్లకు వెళ్లిపోతారు. పిండి వంటలు, కోళ్ల పందేలు, భోగి మంటలు, భావ మరదళ్ల సరదా ఆటలు.. ఆహా.. ఆంధ్రాలో ఈ పండుగ తీరే వేరు. తాజాగా ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు.. పండుగ హాలిడేస్ ఇస్తున్నట్లు.. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి తెలిపారు. 2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయన్నారు.  వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లోని స్కూళ్లకు ఇప్పటికే స్థానిక అధికారులు సెలవులు ప్రకటన ఇచ్చినందున ఈసారి 11-15 లేదా 12-16 తేదీల్లో సంక్రాంతి హాలిడేస్ ఉంటాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. అధికారుల ఇచ్చిన క్లారిటీతో అందరూ ఎంచక్కా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవచ్చు.

2025 సెలవుల లిస్ట్ కూడా ప్రభుత్వం గతంలో విడుదల చేసింది. షెడ్యూల్‌‌లో మొత్తం 23 సాధారణ సెలవులు.. 21 ఆప్షనల్‌ హాలిడేస్‌ ఉన్నాయి. సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేలు రెండూ కలుపుకొని మొత్తంగా 44 రోజులు సెలవులు ఉన్నట్టు ఆంధ్రా సర్కార్ తెలిపింది. అయితే గవర్నమెంట్ ప్రకటించిన సెలవుల్లో 4 సెలవులు ఆదివారం వచ్చాయి. గణతంత్ర దినోత్సవం, ఉగాది, శ్రీరామనవమి సహా మొహర్రం పండుగలు ఆదివారం రోజే రావటం స్కూల్ పిల్లలు బాధపడే విషయం.

About Kadam

Check Also

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్‌గా రాష్ట్రపతి నియమించారు. హర్యానా గవర్నర్‌గా ఆషిం కుమార్ గోష్, లడఖ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *