ఉలిక్కిపడిన మారేడుమిల్లి.. ఎన్‌కౌంటర్‌లో కీలక మావోయిస్టు నేతల మృతి..

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి జిల్లా రంపచోడవరం- మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు కీలక మావోయిస్టు నేతలు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యురాలు అరుణతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు, గాజర్ల రవి అలియస్‌ ఉదయ్‌, ఏవోబీ స్పెషల్‌ జోన్‌ కమిటీ ఏసీఎం అంజు ఉన్నారు. వరుస ఎన్‌కౌంటర్లతో ఇప్పటికే సతమతం అవుతున్న వేళ అల్లూరి జిల్లా ఎదురుకాల్పుల్లో ముగ్గురు కీలక నేతలు మృతి చెందడం మావోయిస్టులకు మరింత షాకిస్తోంది.

అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్‌లోని కింటుకూరు బేస్ క్యాంపు సమీపంలో గ్రేహౌండ్స్‌ బలగాలు- మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ముగ్గురు కీలక మావోయిస్టులు హతమయ్యారు. మరో నలుగురు మావోయిస్టులు పరారవడంతో రంపచోడవరం అటవీ ప్రాంతాన్ని గ్రేహౌండ్స్‌ బలగాలు జల్లెడ పడుతున్నారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ను ముమ్మరం చేస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో గాజర్ల రవి అలియస్ ఉదయ్‌, మరో మావోయిస్ట్ కీలక నేత అరుణ.. మావోయిస్ట్‌ కీలక నేతలకు గార్డ్‌గా వ్యవహరించే అంజు కూడా ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో టీవీ9 ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సాహసోపేతం చేసింది. పోలీసుల ఆంక్షలతో బేస్‌ క్యాంప్‌నకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు మావోయిస్టు కీలక నేతలు ఏఏ ఆపరేషన్స్‌లో పాల్గొన్నారు?.. పోలీసు రికార్డుల్లో వీరిపై ఎలాంటి రివార్డులు ఉన్నాయి?.. అనే అంశాలకు సంబంధించి ఎన్‌కౌంటర్‌ ప్రాంతానికి కూతవేటు దూరం నుంచి మా స్పెషల్‌ కరస్పాండెంట్‌ సత్య ద్వారా తెలుసుకుందాం…

ఇక.. మృతుల్లో గాజర్ల రవి అలియస్ ఉదయ్.. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా వెలిశాలకు చెందినవారు. ఇతనిపై 25 లక్షలు రివార్డ్ ఉంది. మావోయిస్టు సెంట్రల్ కమిటీతోపాటు, AOB స్పెషల్ జోనల్ మెంబర్‌గా ఉన్నారు. గాజర్ల రవి అలియస్‌ ఉదయ్‌ మృతితో ఆయన స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెలిశాలలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఇక.. గాజర్ల రవికి రాజయ్య, సమ్మయ్య, సారయ్య అలియస్‌ ఆజాద్‌, అశోక్‌ అనే నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. వారిలో గాజర్ల రాజయ్య కులవృత్తిలో ఉండగా.. సమ్మయ్య సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నారు. మిగతా ముగ్గురు పోరుబాట పట్టారు. 2008లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాజర్ల సారయ్య అలియస్‌ ఆజాద్‌ ప్రాణాలు కోల్పోగా.. గాజర్ల అశోక్‌ అలియస్‌ ఐతు కొన్ని నెలల క్రితం పోలీసులకు లొంగిపోయారు. ఆ తర్వాత.. కాంగ్రెస్‌లో చేరి.. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌లో హతమైన గాజర్ల రవి అలియస్‌ ఉదయ్‌ గత కొద్దిరోజులుగా హై లెవెల్ షుగర్‌తో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. అరుణ.. విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెంకు చెందినవారు. ఇటీవల మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత చలపతిరావు భార్య, స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు.

అల్లూరి జిల్లా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు కీలక మావోయిస్టు నేతలు మృతి చెందగా మరో నలుగురు తప్పించుకున్నారనే సమాచారంతో గాలింపు చేస్తున్నారు గ్రేహౌండ్స్‌ పోలీసులు..

About Kadam

Check Also

అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఇంత దారుణమా.. ఏకంగా 10 మందితో కలిసి..

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమని గట్టిగా అడిగినందుకు ఒక వ్యక్తి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *