ఆపరేషన్ సింధూర్‌తో పెళ్లి వాయిదా.. ఆ ముచ్చట తీరకుండానే ఇలా..! ఆర్మీ జవాన్ కథ తెలిస్తే..

ఆపరేషన్ సిందూర్‌ కోసం పెళ్లి వాయిదా వేసుకున్న ఓ యువ జవాన్‌ ఆ ముచ్చట తీరకుండానే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదవశాత్తు తుపాకి పేలి బాపట్ల జిల్లా చిలకాలవారిపాలెంకు చెందిన రవి కుమార్ అనే జవాన్ రాజౌరీలో చనిపోయాడు. చేతిలో ఉన్న తుపాకీ మిస్ ఫైర్ అవ్వడంతోనే ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు.

ఆపరేషన్ సింధూర్‌ కోసం పెళ్లి వాయిదా వేసుకున్న ఓ యువ జవాన్‌ ఆ ముచ్చట తీరకుండానే ప్రాణాలు కోల్పోయాడు. రాజౌరీలో విధుల్లో ఉండగా చేతిలో ఉన్న గన్‌ మీస్‌ఫైర్ అవ్వడంతో ఏపీకి చెందిన రవికుమార్ అనే జవాన్‌ మృతి చెందాడు. చిలకాలవారి పాలెంకు చెందిన ఇమాన్యుయేల్, లక్ష్మీ దంపతుల రెండో కుమారుడైన రవి కుమార్ నాలుగేళ్ల క్రితం ఆర్మిలోకి వెళ్లాడు. ఆపరేషన్ సింధూర్ కంటే ముందే సెలవులపై ఇంటికి వచ్చాడు. ఆ సమయంలోనే తల్లిదండ్రులు వివాహ చేయాలని నిశ్చయించారు. బంధువుల అమ్మాయితో నిశ్చితార్ధం కూడా జరిగింది. ఆ తర్వాత వెంటనే పెళ్లి కూడా చేయాలనుకున్నారు.

అయితే ఆపరేషన్ సింధూర్ మొదలవ్వడంతోనే ఆర్మీ నుండి రవికుమార్ కు పిలుపు వచ్చింది. సెలవులు రద్దు చేయడంతో వెనువెంటనే కాశ్మీర్ కు వెళ్లాల్సి వచ్చింది. దీంతో పెళ్లి వాయిదా వేసుకున్న రవి కుమార్ విధుల్లోకి చేరేందుకు వెళ్లిపోయాడు. వెలుతూ వెలతూ యుద్దంలో గెలిచి వచ్చి వివాహం చేసుకుంటానని అందరితో చెప్పి వెళ్లాడు.

ఆపరేషన్ సింధూర్ ముగిసిన ఇంకా రవి కుమార్‌కి సెలవులు మంజూరు కాలేదు. ఈ నేపధ్యంలోనే కాశ్మీర్ లోని రాజౌరీ లో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో రవి కుమార్ చనిపోయాడు. రవికుమార్ మరణ వార్తను విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ బిడ్డ సంతోషాన్ని పంచుకోవాల్సిన సయమంలో దు:ఖాన్ని అనుభవిస్తున్నామని తల్లిదండ్రులు గొల్లుమంటున్నారు. రవి కుమార్ మ్రుతదేహం రేపు స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది.

About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *