రైళ్లను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా చిత్తూరు జిల్లాలో అడ్డంగా దొరికిపోయింది. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 26న చిత్తూరు వద్ద సిద్ధంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చామరాజనగర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్‌ను టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడేందుకు ప్రయత్నించిగా పోలీసులు వీరిని పట్టుకున్నారు. కాగా వీరు గత రెండు నెలల వ్యవధిలోనే 9రైళ్లలో దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.
రైళ్లను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా చిత్తూరు జిల్లాలో అడ్డంగా దొరికిపోయింది. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 26న చిత్తూరు వద్ద సిద్ధంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చామరాజనగర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్‌ను టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడేందుకు ప్రయత్నించిగా పోలీసులు వీరిని పట్టుకున్నారు. కాగా వీరు గత రెండు నెలల వ్యవధిలోనే 9రైళ్లలో దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. మే 2న మామండూరు రైల్వే స్టేషన్ సమీపంలో సోలాపూర్ స్పెషల్ ట్రైన్‌ను టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడిన వీరు.. ప్రయాణికుల నుంచి 35 గ్రాముల బంగారు కొట్టేశారు. అలాగే మే 12న పూతలపట్టు రైల్వే స్టేషన్ వద్ద ఆగి ఉన్న రైలు చివరి భోగిలో దొంగతనానికి ప్రయత్నించారు.. సమయానికి పోలీసులు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు. మళ్లీ మే 14న ముంగిలి పట్టు రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి తిరుపతి-విల్లుపురం ట్రైన్‌లో దోపిడీకి పాల్పడి 24 గ్రాముల బంగారు దోచుకున్నారు. ఇక మే 21న కర్నూలు జిల్లా మంత్రాలయం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు దోపిడీకి ప్రయత్నించిన ముఠా విఫలం కాగా జూన్ 2న చంద్రగిరి సమీపంలోని ముంగిలిపట్టు వద్ద సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి చామరాజనగర్ ఎక్స్ ప్రెస్‌ను దొచుకున్నారు.
జూన్ 5న మానవపాడు వద్ద సిగ్నల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నం చేసి సక్సెస్ కాలేకపోయిన ముఠా తిరిగి జూన్ 13న అలంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలోనూ సిగ్నల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఇక జూన్ 24న మళ్లీ అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద సిగ్నలింగ్ బాక్స్ ట్యాంపరింగ్‌తో రైలు దోపిడీకి పాల్పడి 27 గ్రాముల బంగారు ఎత్తుకెళ్లారు. ఇక ఆఖరిగా చిత్తూరు సమీపంలోని సిద్ధంపల్లి రైల్వే స్టేషన్ వద్ద చామరాజనగర్ రైలునే టార్గెట్ చేసిన ముఠా దోపిడీకి పాల్పడింది. సిగ్నల్ ను ట్యాంపరింగ్ చేసి బోగిల్లోకి చొరబడి ప్రయాణికులను కత్తులతో బెదిరించి 84 గ్రాముల బంగారు ఎత్తుకెళ్లిన దొంగల ముఠా అక్కడి నుంచి పరారీ అయిపోయింది. రైళ్ళను వరుసగా టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న మహారాష్ట్ర గ్యాంగ్ కదలికలపై నిఘా పెట్టిన రైల్వే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గుంతకల్లు రైల్వే ఎస్పీ రాహుల్ మీనా రెండు బృందాలను రంగంలోకి దింపి ఎట్టకేలము మహారాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. . మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఈ ముఠా గడిచిన రెండు నెలల్లో గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో 9 దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రేణిగుంట, తాడిపత్రి, మంత్రాలయం, మానవపాడు, అలంపూర్, ముంగిలిపట్టు, పూతలపట్టు, సిద్దంపల్లి ప్రాంతాల్లో రైలు దోపిడీలకు పాల్పడిన ముఠా దాదాపు 242 గ్రాముల బంగారు దోచుకున్నట్లు తెలిపారు. ముఠాలో ఇప్పటి దాకా ఇద్దరినీ అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు మహారాష్ట్రలోని సోలాపూర్, పూణే ప్రాంతాల్లో మిగతా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అరెస్ట్ అయిన నిందితులు సోలాపూర్‌కు చెందిన జలింధర్ మహిర్యా పవర్, కోహినూర్ నవనత్ పవర్‌గా పోలీసులు తేల్చారు. నిందితుల వద్ద నుండి రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్ కు ఉపయోగించిన కట్టర్ కత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.