ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి ఆస్తి పన్ను రద్దు

దేశ రక్షణలో సైనికులు ప్రాణాలను పణంగా పెట్టి చేసే సేవలు అపూర్వమైనవి. అలాంటి వీర సైనికులను గౌరవించడం ప్రతి పౌరుని, ప్రతి ప్రభుత్వానికీ బాధ్యత. సరిహద్దుల్లో దేశం కోసం యుద్ధం చేసే వారిని మాత్రమే కాకుండా, వారి కుటుంబాలకు కూడా సాయం చేయడం ప్రభుత్వం ప్రధాన కర్తవ్యం. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైనిక కుటుంబాలకు మరింత ఆదరణ చూపుతూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీ పరిధిలో భారత రక్షణ దళాలకు చెందిన సిబ్బంది నివాస గృహాలకు ఆస్తి పన్ను మినహాయింపు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సైనికుల వీరోచిత సేవలను గౌరవిస్తూ, వారి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నారు.

ఇప్పటి వరకు, సరిహద్దుల్లో సేవలు అందిస్తున్న లేదా రిటైర్డ్ సైనికులకు మాత్రమే ఈ పన్ను మినహాయింపు వర్తించేది. అయితే, డిప్యూటీ సీఎం తీసుకున్న తాజా నిర్ణయంతో, సైనికులు ఎక్కడ సేవలందించినా, వారి జీవిత భాగస్వామి నివసించే లేదా కలిసికట్టుగా ఉంచుకున్న ఒక్క ఇల్లు ఈ మినహాయింపుకు అర్హత పొందుతుంది. అంటే, సైనికుడి సేవలు ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్నా, ఆయన కుటుంబం ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే, ఆ గృహానికి పన్ను మినహాయింపు లభిస్తుంది.

సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ సిఫార్సు మేరకు, ఈ నిర్ణయం తీసుకున్నట్టు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. “సైనిక కుటుంబాలకు మేము అండగా నిలవాలి. వారు దేశ రక్షణ కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. కనీసం వారి గృహాలకు ఆస్తి పన్ను మినహాయింపుతో వారిపై ఆర్థిక భారం తగ్గిద్దాం” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లోని సైనిక కుటుంబాలకు పెద్ద ఉపశమనం కలిగించనుంది. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, సైనికుల వీరోచిత సేవలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ సూచిక. ఈ చర్య ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సైనికుల పట్ల గౌరవ భావాన్ని మరింత బలపరిచింది. ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు సైనిక కుటుంబాల పట్ల గౌరవం ఎలా చూపాలో ఒక మంచి ఉదాహరణగా నిలిచింది.

About Kadam

Check Also

ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్ ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు జూన్‌ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *