నిరుద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు వయోపరిమితి పెంచిన కూటమి సర్కార్!

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సహా ఇతర నియామక సంస్థల ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ యూనిఫామ్ పోస్టులకు గరిష్ట వయోపరిమితిని రెండు సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమలు అవుతుందని స్పష్టం చేసింది. APPSC, ఇతర నియామక సంస్థల ద్వారా రాబోయే నియామకాల్లోని అన్ని సర్వీసులలోని..

రాష్ట్ర నిరుద్యోగులకు కూటమి సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆయా కేటగిరీలో నిరుద్యోగుల వయోపరిమితిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రస్తుతం ఉన్న వయోపరిమితి కంటే యూనిఫామ్‌ ఉద్యోగాలకు రెండేళ్లు పెంచింది. అలాగే నాన్‌ యూనిఫామ్‌ ఉద్యోగాలకు వయోపరిమితి 34 నుంచి 42 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు వయోపరిమితి రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది (2025) సెప్టెంబరు 30వ తేదీలోపు జరిగే నియామకాలకు తాజా వయోపరిమితి పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీపీఎస్సీతో పాటు పలు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు వయోపరిమితి పెంపు వర్తిస్తుంది.

యూనిఫామ్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్, ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 1996 రూల్ 12 ప్రకారం గరిష్ట వయోపరిమితి కంటే ఎక్కువ వయోపరిమితిని అనుమతించారు. వయోపరిమితి పెంపు విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ఈ విషయాన్ని పరిశీలించి.. ఈ మేరకు సెప్టెంబర్ 30 వరకు వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ పోస్టులకు గరిష్టంగా 2 సంవత్సరాలు వయోపరిమితి పెంచారు. అయితే స్టేట్, సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌, సంబంధిత స్పెషల్ లేదా అడ్హాక్ రూల్స్‌లో శారీరక ప్రమాణాలు నిర్దేశించిన పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖ, రవాణా శాఖలు వంటి యూనిఫామ్ సర్వీసు డైరెక్ట్ రిక్రూట్మెంట్‌ పోస్టులకు మాత్రం ఈ సడలింపు వర్తించదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు

కాగా రాష్ట్రంలో గతేడాది జూన్‌లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన నాటి నుంచి పలు సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా ఈ నెలలో మెగా డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

About Kadam

Check Also

క్రైమ్‌కు కళ్లెం.. విజయనగరం టూ టౌన్ పోలీసుల యాక్షన్ ప్లాన్ అదుర్స్

రోజురోజుకు పెరుగుతున్న క్రైమ్‌కు కళ్లెం వేసేందుకు పోలీసులు సరికొత్త విధానాలతో ముందుకు సాగుతున్నారు. క్రైమ్ జరగకుండా ముందుస్తు నిఘా పెట్టడంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *