అనుమానమే పెనుభూతమై.. ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చిన భర్త.. కట్‌చేస్తే..

తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో దారణం వెలుగు చూసింది. అనుమానం ఒక పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అతి దారుణంగా బండరాయితో కొట్ట హత్య చేశాడు. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న పిల్లలకు విషయాన్ని వాళ్ల అమ్మమ్మకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

జీవితాంతం తోడుగా ఉంటానంటూ మూడు ముళ్లు వేశాడు. ఏడు అడుగులు నడిచాడు. సొంతూరు నుంచి అత్తవారి ఊరుకు మకాం మార్చాడు. వారి అన్యోన్య దాంపత్యానికి ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్లు పెద్దవాళ్లు అయ్యారు. ఇన్నేళ్ల తర్వాత భార్యపై అతనకు అనుమానం మొద లైంది. అది శృతిమించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆఖరిగా ఆమెను అంత మొందించాడు. రాజానగరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కొంతమూరుకు చెందిన ఉషారాణి(45)కి నర్సీపట్నం మండలం గిడుగుటూరుకు చెందిన వేమగిరి మాణిక్యంతో పదేళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత వీరు కొంతమూరు వచ్చేశారు. అతను వెల్డింగ్ పనిచేసు కుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ ఇద్దరి దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు నిహంత్, ఏడేళ్ల కుమార్తె నిస్సి ఉన్నారు.

అయితే సాఫీగా సాగిపోతున్న వీళ్ల జీవితంలోకి అనుమానం అనే భూతం ప్రవేశించింది. దీంతో గత కొన్ని రోజులుగా భార్యను భర్త మాణిక్యం అనుమానించడం స్టార్ట్ చేశాడు. ఈ అనుమానంతోనే తరచూ ఆమెను వేధిస్తూ ఉండేవాడు. ఇక భర్త వేధింపులను భరించలేకపోయిన భార్య రాజానగరం పోలీసులను ఆశ్రయించింది. భర్త తనను పెడుతున్న టార్చర్‌ గురించి ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటి నుంచి మాణిక్యం ఇంట్లో నుంచి పారిపోయి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.

అయితే తాజాగా శనివారం రాత్రి ఇంటికొచ్చిన మాణిక్యం భార్యతో వాగ్వాదానికి దిగాడు. దీంతో భార్య భర్తల మధ్య గొడవ పెరగడంతో మాణిక్యం సమీపంలోని నాపరాయి తీసుకుని భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో భార్య అక్కడికక్కడే పడిపోయింది. దాడి సమయంలో అక్కడే ఉన్న పిల్లలు వెంటనే పక్కవీధిలో ఉంటున్న అమ్మమ్మకు విషయం చెప్పారు. వాళ్లు వచ్చే సరికి ఉషారాణి అపస్మారస్థితిలో పడిపోవడం గమనించారు. వెంటనే ఆమెను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఆక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్టు నిర్ధారించారు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About Kadam

Check Also

ఆపరేషన్‌ మహదేవ్‌.. పహల్గామ్‌‌లో టూరిస్టులను చంపిన ముగ్గురు ఉగ్రవాదులు హతం..

పహల్గామ్ లో అమాయక టూరిస్టులను  చంపిన ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చాయి.. ఆర్మీ , సీఆర్‌పీఎఫ్‌ , జమ్ముకశ్మీర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *