అప్పుడే ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు తేదీలు వచ్చేశాయ్‌.. ఈసారి ఫిబ్రవరిలోనే ఎగ్జామ్స్‌!

రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు తేదీలను విడుదల చేసింది. రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిల్ అయిన విద్యార్థులు(జనరల్, వొకేషనల్), కాలేజీలో చదవకుండా ప్రైవేట్‌గా హ్యూమానిటీస్ గ్రూప్‌లో పరీక్షకు..

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు తేదీలను విడుదల చేసింది. రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిల్ అయిన విద్యార్థులు(జనరల్, వొకేషనల్), కాలేజీలో చదవకుండా ప్రైవేట్‌గా హ్యూమానిటీస్ గ్రూప్‌లో పరీక్షకు సిద్ధం అవుతున్న విద్యార్ధులు అందరూ సెప్టెంబరు 15 నుంచి పరీక్ష ఫీజు చెల్లించవచ్చని బోర్డు తెలిపింది. విద్యార్ధులు చదువుతున్న కాలేజీల్లోనే ప్రిన్సిపల్‌కు పరీక్షల ఫీజును అందించాలని సూచించింది. అక్టోబర్‌ 10వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజును చెల్లించాలని బోర్డు వెల్లడించింది. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా ఇంటర్‌ పరీక్షల తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను జారీ చేశారు. రూ.1000 ఆలస్య రుసుముతో అక్టోబర్‌ 11 నుంచి 21 వరకు అవకాశం ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష ఫీజు చెల్లింపులకు అవకాశం ఇవ్వబోమని బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు కాలేజీల ప్రిన్సిపల్స్ సకాలంలో ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

జనరల్ లేదా వొకేషనన్ కోర్సుల థియరీ పేపర్లకు రూ.600, జనరల్ కోర్సులు(సెకండ్ ఇయర్), వొకేషనల్(ఫస్ట్, సెకండ్ ఇయర్) ప్రాక్టికల్స్‌కు రూ.275, జనరల్ బ్రిడ్జికోర్సు సబ్జెక్టులకు రూ.165, వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సు ప్రాక్టికల్స్(సెకండ్ ఇయర్) రూ.275 చొప్పున చెల్లించాలని సూచించారు. ఫస్ట్, సెకండ్ ఇయర్ రెండూ కలిపి థియరీ పరీక్షలు ఉంటే రూ.1200గా నిర్ణయించారు. వొకేషనల్ కోర్సుల ప్రాక్టికల్స్ రూ.550, జనరల్, వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సు పేపర్లకు రూ.330గా ఉంది. ఫస్ట్, ఇయర్ సెకండర్ ఇయర్ పాస్ అయిన విద్యార్ధులు రీ అపియరింగ్ కోసం ఆర్ట్స్ సబ్జెక్టులకు రూ.1350, సైన్స్ సబ్జెక్టులకు రూ.1600 చొప్పున ఫీజులు చెల్లించవల్సి ఉంటుంది.

కాగా ఈసారి ఫిబ్రవరిలోనే ఇంటర్ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే ఇంటర్‌ బోర్డు వెల్లడించిన సంగతి తెలిసిందే. గతంలో మార్చిలో మాత్రమే ఇంటర్ పరీక్షలు జరిగేవి. అయితే ఈసారి ఫిబ్రవరిలోనే నిర్వహించాలని భావిస్తున్నారు. అలాగే ఏప్రిల్‌లో తరగతుల నిర్వహణకు అనుకుగణంగా కాస్త ముందుగానే పరీక్షలు పూర్తి చేయాలని బోర్డు భావిస్తుంది. మెుదట సైన్స్ గ్రూప్ సబ్జెక్టుల విద్యార్థులకు రోజుకు ఒక్కో సబ్జెక్టు చొప్పున పరీక్షలు జరుగుతాయి. గతంలో ఎంపీసీ, బైపీసీ, ఆర్ట్స్ గ్రూపుల వారికి ఒకేరోజు పరీక్షలు జరిగేవి. ఇక సైన్స్ గ్రూపుల పరీక్షల తర్వాత చివరిలో లాంగ్వేజెస్ పరీక్షలు ఉంటాయి. ఆ తర్వాత ఆర్ట్స్ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు భావిస్తుంది. ఈ మేరకు సీబీఎస్ఈ షెడ్యూల్‌ను అనుసరించి పరీక్షలను ఫిబ్రవరిలోనే నిర్వహించాలని నిర్ణయించింది.

About Kadam

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *