ఆంధ్రప్రదేశ్ లాసెట్ 2025 ఫలితాలు గురువారం (జూన్ 19) విడుదలైన సంగతి తెలిసిందే. లాసెట్‌తోపాటు పీజీఎల్‌సెట్ ఫలితాలను కూడా అధికారులు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి వివిధ లా కోర్సుల్లో ప్రవేశాలకు మూడేళ్లు, ఐదేళ్ల లా సెట్‌తోపాటు పీజీఎల్ ప్రవేశ పరీక్షలను శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జూన్ 5న ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 27,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. తాజా ఫలితాల్లో అందులో 20,826 మంది విద్యార్థులు అర్హత సాధించారు. విద్యార్ధులు తమ ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ చేసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, లాసెట్ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మూడేళ్లు లాసెట్‌లో టాపర్లు
- వేముల వెంకట శివసాయి భార్గవి (అనకాపల్లి)
- ముదునూరి రామ్‌తేజ్ వర్మ (విశాఖ)
- పల్నాటి సత్యాంజనదేవి (ఏలూరు)
- వి. రమేష్ (రాయచోటి)
- బొప్పన శరత్‌చంద్ర (అవనిగడ్డ)
- దాసరి మాధవరావు (సత్తెనపల్లి)
- డీవీ సూర్య సత్య మహేంద్ర (ఉండ్రాజవరం)
- ఎం. మల్లికేశ్వరపు డి. సాయికృష్ణ (జి.కొండూరు)
- కిరణ్ కుమార్ సింగంశెట్టి (విజయనగరం)
- పాతూరు హరీష్ (రామవరప్పాడు)
ఐదేళ్ల లాసెట్‌లో టాపర్లు
- పల్లపు గ్రీష్మ (అన్నమయ్య జిల్లా)
- సింగమల భావన (తిరుపతి)
- భత్తుల సూర్యతేజ (నరసారావుపేట)
- నక్కా ఉదయచంద్ర (చీపురుపల్లి )
- మరుపల్లి రమేష్ (పెందుర్తి)
- వెంకటరమణ (మదనపల్లి)
- లహరి ఎలుగూరి (విజయవాడ)
- సయ్యద్ అప్సానా జబాన్ (కల్లూరు )
- ఆళ్ల యశశ్వి (గుంటూరు)
- మహమ్మద్ ఇంతియాజ్ (విజయవాడ)
పీజీఎల్ సెట్‌లో టాపర్లు
- బైసని హరితశ్రీ (అద్దంకి)
- యనమల లోకేశ్వరి (ఒంటిమిట్ట)
- కొర్సపాటి ప్రశాంత్ (ఒంగోలు)
- శ్రావ్య గొర్లి (విశాఖ)
- రమీజ్ రాజా షేక్ (విశాఖ)
- ఎం.విజయమణికంఠ (శ్రీకాకుళం)
- సీహెచ్. ద్యానేష్ నాయుడు (విజయనగరం)
- నిమ్మకూరి రామకృష్ణ (పొన్నూరు)
- శ్రీరాం బొడ్డు (హైదరాబాద్)
- ఆర్. దుర్గా ప్రవీణ్ (రాజమహేంద్రవరం)