ఏపీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూళ్లు వచ్చేశాయ్.. ఏయే తేదీల్లో ఎప్పుడెప్పుడంటే?

AP CET’s Counseling Schedule 2025: లాసెట్, పీజీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌ 2025లకు సంబంధించిన ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఒక్కో సెట్‌కు రెండు విడతలుగా కౌన్సెలింగ్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తొలుత ఏపీ లాసెట్, పీజీ లాసెట్‌ 2025 ప్రవేశాలు..

రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన లాసెట్, పీజీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌ 2025లకు సంబంధించిన ఫలితాలు విడుదలైనప్పటికీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభంకాలేదు. తాజాగా ఉన్నత విద్యామండలి అన్ని సెట్ల ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లను విడుదల చేసింది. ఒక్కో సెట్‌కు రెండు విడతలుగా కౌన్సెలింగ్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తొలుత ఏపీ లాసెట్, పీజీ లాసెట్‌ 2025 ప్రవేశాల కౌన్సెలింగ్‌ సెప్టెంబర్‌ 8 నుంచి ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి టీవీ శ్రీకృష్ణమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు.

ఏపీ లాసెట్, పీజీ లాసెట్‌ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌..

  • లాసెట్, పీజీ లాసెట్‌ 2025 ప్రవేశాల కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లు: సెప్టెంబర్‌ 8 నుంచి 11వ తేదీ వరకు
  • ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: సెప్టెంబర్‌ 9 నుంచి 12 వరకు
  • వెబ్‌ ఐచ్ఛికాల నమోదు తేదీలు: సెప్టెంబర్‌ 12 నుంచి 14 వరకు
  • ఐచ్ఛికాలను మార్పు చేసుకునేందుకు: సెప్టెంబర్‌ 15న అవకాశం
  • సీట్ల కేటాయింపు: సెప్టెంబర్‌ 17న
  • కళాశాలల్లో చేరికలు: సెప్టెంబర్‌ 19 నుంచి

ఏపీ ఎడ్‌సెట్‌ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌..

  • బీఈడీలో ప్రవేశాలకు ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లు: సెప్టెంబర్‌ 9 నుంచి12 వరకు
  • ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: సెప్టెంబర్‌ 10 నుంచి 13 వరకు
  • వెబ్‌ ఐచ్ఛికాల నమోదు తేదీలు: సెప్టెంబర్‌ 13 నుంచి15 వరకు
  • ఐచ్ఛికాల మార్పు: సెప్టెంబర్‌ 16న అవకాశం
  • సీట్ల కేటాయింపు, కాలేజీల్లో చేరికలు: సెప్టెంబర్‌ 19, 20 తేదీల్లో

ఏపీ పీఈసెట్‌ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

కాలేజీల్లో చేరికలు: సెప్టెంబర్ 22, 23 తేదీల్లో

పీఈసెట్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు: సెప్టెంబర్‌ 10 నుంచి13 వరకు

ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: సెప్టెంబర్‌ 11 నుంచి 14 వరకు

వెబ్‌ ఐచ్ఛికాల నమోదు: సెప్టెంబర్‌ 14 నుంచి16 వరకు

ఐచ్ఛికాల మార్పు: సెప్టెంబర్‌ 17న అవకాశం

సీట్ల కేటాయింపు: సెప్టెంబర్ 19న

About Kadam

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *