మెగా డీఎస్సీ ఆన్సర్ ‘కీ’, రెస్పాన్స్‌షీట్లు వచ్చేశాయ్‌.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ పరీక్షలు జులై 2వ తేదీలో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’, రెస్పాన్స్‌ షీట్లను ఒక్కొక్కటిగా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతూ వస్తుంది. మిగిలిన అన్ని సబ్జెక్టుల అన్ని పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీలను, రెస్పాన్స్‌ షీట్లను జులై 3 నుంచి వెబ్‌సైట్‌లోకి అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్‌ వెంకట కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలతో లాగిన్‌ అయ్యి ఆన్సర్ కీ, రెస్సాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.

జూన్‌ 6 నుంచి జూన్‌ 28 వరకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ‘కీ’ని విడుదల చేశామన్నారు. ఇందులో పీజీటీ కామర్స్, ఇంగ్లిష్, హిందీ, భౌతికశాస్త్రం, సంస్కృతం, సాంఘిక శాస్త్రం, తెలుగు, స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగంలో ఆంగ్లం, భౌతికశాస్త్రం పరీక్షల ‘కీ’లు ఉన్నాయని వెల్లడించారు. అలాగే ఎస్జీటీ జనరల్, స్పెషల్‌ పోస్టులు, టీజీటీలో ఇంగ్లిస్, హిందీ, భౌతికశాస్త్రం, తెలుగు, ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష, స్పెషల్‌ పీఈటీ, జనరల్‌ పీఈటీకి సంబంధించిన అన్ని మాధ్యమాల ప్రాథమిక ఆన్సర్ ‘కీ’, రెస్పాన్స్‌ షీట్లూ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. వీటిపై అభ్యంతరాలను తెలిపేందుకు జులై 11వ తేదీ వరకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆన్సర్‌ కీపై అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో పంపించాలని సూచించారు. అయితే జూన్‌ 29 నుంచి జులై 2 వరకు జరిగిన పరీక్షల ప్రాథమిక ఆన్సర్ ‘కీ’లను కూడా త్వరలో విడుదల చేస్తామని కన్వీనర్‌ వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

మరోవైపు మెగా డీఎస్సీ విజయవంతంగా నిర్వహించినందుకు అన్ని జిల్లాలు, రాష్ట్ర అధికారులకు విద్య శాఖ మంత్రి నారా లోకేశ్​ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. 31 కోర్టు కేసులు దాటుకుని పరీక్షలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. ఎస్సీ ఉప-వర్గీకరణ, స్పోర్ట్స్ కోటా నిబంధనల మేరకు నియామకాలు చేపట్టామని అన్నారు. ప్రాథమిక ఆన్సర్‌ కీపై అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత తుది ‘కీ’ విడుదల చేస్తామన్నారు. తుది వచ్చిన వారం రోజుల్లోనే ఫలితాలు కూడా వెల్లడిస్తామని తెలిపారు.

About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *