రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్యాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2025(APPGCET) పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్యాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2025(APPGCET) పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యామండలి ర్యాంకు కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. పీజీసెట్ పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్, హాల్‌టికెట్ నంబర్ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 93.55శాతం మంది విద్యార్ధులు అర్హత సాధించారు.
కాగా జూన్ 9 నుంచి 12 వరకు ఉదయం, సాయంత్రం రోజుకు మూడు సెషన్లలో ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25,688 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను తాజాగా విడుదల చేసిన ఉన్నత విద్యామండలి త్వరలో కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభించనుంది.
తెలంగాణ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2025(టీజీ లాసెట్ 2025) ర్యాంకు కార్డులు కూడా తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఫలితాలను విడుదల చేసింది. టీజీ లాసెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా జూన్ 6వ తేదీన టీజీ ఎల్‌సెట్, పీజీ ఎల్‌సెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 57,715 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 45,609 మంది పరీక్ష రాశారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి 32,118 మంది, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంకు 13,491 మంది పరీక్షలు రాశారు.