AP Pharmacy Counselling: ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్‌లో ఫార్మసీ ప్రవేశాలు షురూ.. రేపట్నుంచి కౌన్సెలింగ్‌

ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సాంకేతిక విద్యాశాఖ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 29వ తేదీ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది..

ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్‌లో ఫార్మసీ ప్రవేశాలకు సాంకేతిక విద్యాశాఖ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 29 నుంచి 30 వరకు ఎంపీసీ స్ట్రీమ్‌లో, 30 నుంచి డిసెంబరు 5 వరకు బైపీసీ స్ట్రీమ్‌లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఎంపీసీ విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 29 నుంచి డిసెంబరు 1 వరకు, బైపీసీ విద్యార్థులకు డిసెంబరు 2 నుంచి 6వ తేదీ వరకు ఉంటుంది. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ ఐచ్ఛికాల నమోదు ఎంపీసీ స్ట్రీమ్‌లో ఈ నెల 29 నుంచి డిసెంబరు ఒకటి వరకు, బైపీసీ స్ట్రీమ్‌లో డిసెంబరు 3 నుంచి 7 వరకు అవకాశం కల్పించారు. ఎంపీసీ వారికి డిసెంబరు 4న, బైపీసీ వారికి డిసెంబరు 11న సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన ఎంపీసీ విద్యార్థులు డిసెంబరు 4 నుంచి 6లోపు కాలేజీల్లో ప్రవేశాలు పొందాలి. అలాగే బైపీసీ విద్యార్థులు డిసెంబరు 11 నుంచి 14లోపు సీట్లు పొందిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ఎంపీసీ వారికి డిసెంబరు 5 నుంచి, బైపీసీ వారికి డిసెంబరు 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.

తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ఆన్సర్‌ కీ విడుదల.. త్వరలో ఫలితాలు

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌నర్సు) పోస్టుల భర్తీకి నవంబర్ 23న నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ప్రిలిమినరీ కీతో పాటు ప్రశ్నపత్రాలు, రెస్పాన్స్‌ షీట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కీపై అభ్యంతరాలు తెలియజేయాలంటే ఆన్‌లైన్‌ విధానంలో గడువు తేదీలోపు తెలియజేయాలి.

కాగా ఈ నోటిఫికేషన్‌ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, వైద్యవిద్య డైరెక్టరేట్‌ పరిధిలో 1576 స్టాఫ్‌నర్సు పోస్టులు, తెలంగాణ వైద్య విధానపరిషత్‌ పరిధిలో 332 పోస్టులు, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో 80 పోస్టులు, ఆయుష్‌లో 61 పోస్టులు, ఐపీఎంలో ఒక స్టాఫ్‌నర్సుతో కలిపి మొత్తం 2050 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్‌ కీ తయారు చేసి, ఆ తర్వాత త్వరలోనే ఫలితాలు విడుదల చేస్తారు. రాతపరీక్షకు 80 మార్కులు, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసుకు 20 మార్కుల చొప్పున వెయిటేజీ ఇస్తారు.

About Kadam

Check Also

AP Inter Exam Schedule: మార్చి 1వ తేదీ నుంచి ఏపీ ఇంటర్‌ పరీక్షలు.. షెడ్యూల్‌ విడుదల

ఏపీ ఇంటర్మీడియేట్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *