ఏపీ ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభం.. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే?

ఏపీలోని ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించింది. నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లు- ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు) 2025-26 విద్యా సంవత్సరానికి గానూ పీయూసీ-బీటెక్‌ (రెండేళ్లు పీయూసీ, నాలుగేళ్లు బీటెక్) ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధుల నుంచి ఏప్రిల్‌ 27 నుంచి మే 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర విద్యార్థులకు 85 శాతం, ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి 15 శాతం సీట్లు భర్తీ చేయనున్నారు.

సర్కార్ బడుల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్‌ స్కోర్‌ను యాడ్‌ చేసి మెరిట్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇందులో భాగంగా నూజివీడు క్యాంపస్‌లో జూన్‌ 30న కౌన్సెలింగ్‌ను ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, నూజివీడు డైరెక్టర్‌ ఆచార్య అమరేంద్రకుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూజివీడు, ఆర్కే వ్యాలీలో కలిపి తొలిరోజు 1010 సీట్లు కేటాయించామన్నారు. ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జులై 4 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌ అనంతరం జులై 14 నుంచి తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

డా బీఆర్‌ అంబేడ్కర్ వర్సిటీ 2025-26 ప్రవేశాలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలోని డా.బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ బీఏ, బీకాం, ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ కోర్సులు, బిఎల్‌ఐఎసీ, ఎంఎల్ఐఎసీ, పీజీ డిప్లమో, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2025-2026 విద్యా సంవత్సరం ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న అధ్యయన కేంద్రాలను మాత్రమే విద్యార్ధులు ఎంచుకోవాలని వర్సిటీ పేర్కొంది.

About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *