కేజీ టు పీజీ విద్యలో సమూల మార్పులు.. రేమండ్స్‌తో కీలక ఒప్పందం: మంత్రి నారా లోకేశ్‌

ఉపాధ్యాయ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం, పాఠ్యాంశాల్లో సాంకేతికతను సమగ్రపరచడం, విద్యార్థుల ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్ నైపుణ్యాలను బలోపేతం చేయడం ద్వారా విద్య నాణ్యతను పెంచడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సులోచనాదేవి సింఘానియా స్కూల్ ట్రస్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్, డైరెక్టర్ (రేమండ్ గ్రూప్) ట్రస్ట్ ఛైర్మన్ గౌతమ్ హరి సింఘానియా ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో సమూల మార్పులు చేసేందుకు కూటమి సర్కార్‌ చకచకాల ఏర్పాట్లు చేస్తుంది. మన విద్యా రంగాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని విద్య శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అమలు చేస్తోన్న మూస పద్ధతులకు స్వస్తి చెప్పి సృజనాత్మకత పెంపొందించేలా కేజీ టు పీజీ విద్య కరిక్యులమ్‌లో సమూల మార్పులు తెస్తున్నామని అన్నారు. డిగ్రీ విద్యా పూర్తి చేసుకుని కాలేజీ నుంచి బయటకు వచ్చే విద్యార్థికి వెనువెంటనే ఉద్యోగం లభించేలా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. జాతీయ విద్యావిధానం లక్ష్యసాధనలో భాగంగా రాష్ట్రంలో విద్యానైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు సులోచనాదేవి సింఘానియా స్కూల్ ట్రస్ట్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో ఏపీ ప్రభుత్వంతో సింఘానియా గ్రూప్ (రేమండ్స్) అవగాహన ఒప్పందం కుదిరింది. తిరుపతి జిల్లాలోని 14 పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, నాణ్యత, ఉపాధ్యాయ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీషు శిక్షణ వంటి అంశాల్లో విద్యా నైపుణ్యాన్ని తీసుకురావడం ద్వారా పాఠశాలల నిర్వహణలో మార్పులు తేవాలని నిర్ణయించారు. జాతీయ విద్యావిధానంతో సమాంతరంగా సాంకేతికత అనుసంధానం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఐదేళ్ల వ్యవధిలో ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. తద్వారా లక్ష మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది. తిరుపతి తర్వాత అమరావతి, విశాఖపట్నం, కాకినాడకు కూడా ట్రస్ట్ సేవలను విస్తరించనున్నారు.

విద్యార్థులను ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యవంతంగా తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింఘానియా గ్రూప్ చైర్మన్ తెలిపారు. అలాగే పాఠశాలల్లోని ఉపాధ్యాయుల సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు విజయవాడ, వైజాగ్, అమరావతిలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. పాఠ్యాంశాల్లో సాంకేతికతను మెరుగుపరచడం, ఆంగ్లంలో విద్యార్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలను బలోపేతం చేయడం ద్వారా విద్య నాణ్యతను పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.

About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *