వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు పూజలందుకున్న గణపయ్యను నిమజ్జనం చేసే ముందూ ఆయన చేతిలో ఉన్న లడ్డూ, పండ్లను వేలం వేయడం జరుగుతుంది. వేలంలో పాల్గొని భక్తులు వాటిని కొనడం జరుగుతుంది. ఎక్కడైనా ఇదే పద్దతి ఉంటుంది. కానీ ఏలూరు జిల్లాలోని ఉండ్రాజవరంలో మాత్రం ఏకంగా తొమ్మిది రోజులు పూజలందుకున్న మట్టిగణప్య విగ్రహాన్నే వేలం వేస్తారు. వేలంలో విగ్రహాన్ని దక్కించుకున్న వారు. ఆ విగ్రహాన్ని తమ పొలంలో నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడం ద్వారా పంటలు సమృద్దిగా పండుతాయని వారు నమ్ముతారు.
వినాయక చవితి వస్తుందంటే చాలు భారతదేశంలో ప్రతి ఊరు, వీధి పండుగ శోభతో కళకళలాడుతూ ఉంటుంది. బొజ్జ గణపయ్యను వివిధరూపాల్లో మండపాల్లో , ఇళ్లలో ఏర్పాటు చేసి భక్తి కొద్దీ కొలిచి నదిలో నిమజ్జనం చేస్తారు. దీనికి ముందు మండపాల వద్ద వినాయకుడికి నైవేద్యంగా పెట్టిన లడ్డూ వేలం పాట జరుగుతుంది. భక్తులు తమ తమ శక్తీ కొద్దీ పాడి వేలంలో లడ్డూను దక్కించుకుంటారు. అలడ్డూను బంధు మిత్రులందరికీ పంచుతారు. కానీ ఈ ఊర్లొమాత్రం మండపంలో పూజలు అందుకున్నా వినాయకుడినే ఏకంగా వేలం వేస్తారు. సాధారణంగా వినాయక మండపాల్లో లడ్డూ వేలం వేయడం చూస్తుంటాం అయితే ఉండ్రాజవరం మండలంలోని చివటం గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా వర సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాన్ని వేలం వేస్తారు.
ఇక్కడ ప్రతి ఏడాది ఇలాగే గణపయ్య విగ్రహాన్ని వేళం వేస్తారు. ఈ ఏడాది జరిగిన వేలంలో అదే గ్రామానికి చెందిన చిలుకూరి శ్రీనివాస్ అనే భక్తుడు రూ.2.39 లక్షలు గణపయ్య విగ్రహాన్ని దగ్గించుకున్నాడు. అదే మండపలంలో ఏర్పాటు చేసిన మరో అట్ట వినాయక విగ్రహాన్ని మోతే ఏసు అనే భక్తుడు రూ.25 వేలకు దక్కించుకున్నాడు. ప్రతి ఏటా ఇలా విగ్రహాన్ని వేలంలో దక్కించుకున్న భక్తులు తమ వ్యవసాయభూమిలో నిమజ్జనం చేస్తారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని మంచి జరుగుతుందని భావిస్తుంటారు.