ఈ అల్పపీడనం రాబోయే 12 గంటల్లో దాదాపు ఉత్తరం వైపు కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ మేరకు శుక్రవారం రాబోవు మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై ప్రకటన విడుదల చేసింది..
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం ఈరోజు డిసెంబర్ 20, 2024 ఉదయం 08.30 గంటలకు అదే ప్రాంతంలో కొనసాగుతోంది.. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం రాబోయే 12 గంటల్లో దాదాపు ఉత్తరం వైపు కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత, ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో వాయుగుండం మరింత తీవ్రతతో కొనసాగనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది..
వీటి ఫలితంగా ఏపీ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉండనున్నాయో అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్లు గరిష్టముగా 60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశం ఉంది..
శనివారం, ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
శుక్రవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది.
శనివారం, ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ;-
శుక్రవారం, శనివారం, ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.