రాబోయే మూడు రోజులలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్.. రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు సూచనలు ఉన్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ఉత్తర అంతర్గత కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం 5.8 కి.మీ ఎత్తులో నైరుతి దిశగా విస్తరించింది. పశ్చిమ మధ్య అరేబియా సముద్రం నుండి తూర్పు తీర ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ఆవర్తనం 3.1 – 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో 3.1 – 5.8 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం నైరుతి వైపు వంగి ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరంలో 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉంది. రాబోయే మూడు రోజుల వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసకుందాం…
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం
శనివారం, ఆదివారం, సోమవారం : తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురుస్తాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:
శనివారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల ఉంటాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచవచ్చు.
ఆదివారం, సోమవారం : తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల ఉంటాయి. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు ఉండే అవకాశం ఉంది.
రాయలసీమ:
శనివారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురుస్తాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచవచ్చు.
ఆదివారం: వర్షాలు మరింత మోస్తరంగా ఉంటాయి. గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
సోమవారం: ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఉంటాయి. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు ఉంటాయి.