అక్కడున్నది CBN..! ఇది కదా అద్దిరిపోయే స్వీట్ న్యూస్.. ఏపీకి ఇక సొంతంగా

విజన్-2047 దృష్టిలో పెట్టుకుని ఏపీలోని అమరావతిని వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్ సిటీస్ ఇన్ ఇండియాగా తీర్చిదిద్దుతున్నారు సీఎం చంద్రబాబు. ఆయన విజన్ నుంచి వచ్చినదే ఈ ‘అమరావతి క్వాంటం వ్యాలీ’.. మరి ఆ వార్త ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

అమరావతి క్వాంటం వ్యాలీ – నేషనల్ వర్క్‌షాప్’ కర్టెన్ రైజర్ కార్యక్రమం బుధవారం ఉదయం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న ప్రసంగిస్తూ, క్వాంటం టెక్నాలజీతో కూడిన భవిష్యత్తు దిశలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయాణాన్ని వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. క్వాంటం కంప్యూటింగ్ అనేది ఇప్పటివరకు మనకు పరిచయమైన ప్రస్తుత కంప్యూటింగ్ పరిమితులను అధిగమించి, అసాధారణమైన వేగం, ఖచ్చితత్వంతో పనిచేసే సాంకేతికత. ఇది ఏకంగా మన ఆలోచనల్ని కూడా దాటి వెళ్తుంది. గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఇప్పటికే ఈ రంగంలో పలు అడుగులు వేసినవే. గత 30-40 సంవత్సరాలుగా క్వాంటం కంప్యూటింగ్‌పై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ రంగం వేగంగా వాణిజ్య అనువర్తన దశలోకి ప్రవేశిస్తోంది. త్వరలోనే ఇది జన జీవితంలో విస్తృతంగా విస్తరించబోతోందని ప్రద్యుమ్న స్పష్టం చేశారు.

అత్యంత వేగం, కచ్చితత్వం..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్వాంటం క్రిప్టోగ్రఫీ, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం సెన్సింగ్, క్వాంటం మెడిసిన్ వంటి రంగాల్లో శాస్త్రీయ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని.. ఇది బ్యాంకింగ్, డిఫెన్స్, వైద్యారోగ్యం, విద్యా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని ప్రద్యుమ్న తెలిపారు. నిమిషాల్లోనే పరిశోధనలు, గంటలలో ఉత్పత్తుల రూపకల్పన – ఇవన్నీ క్వాంటం టెక్నాలజీ వల్లనే సాధ్యమవుతాయని వివరించారు.

అమరావతిలో క్వాంటం వ్యాలీ..

ఈ క్వాంటం రివల్యూషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుకూలమైన భూమిగా ఉందని ప్రద్యుమ్న స్పష్టం చేశారు. రాష్ట్ర యువతలోని ఐటీ నైపుణ్యాలు, డిజిటల్ సామర్థ్యాలు ఈ రంగంలో ఏపీకి లీడర్‌షిప్ పజిషన్ ఇచ్చే అవకాశముంది. తగిన విధంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కీలక కేంద్రంగా ఎదగవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో జనవరి 2026 నాటికి ‘క్వాంటం వ్యాలీ’ కేంద్రాన్ని ప్రారంభించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ఈ నెల 30వ తేదీన జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహించబోతున్నామని వెల్లడించారు. ఈ వర్క్‌షాప్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, పాలసీ మేకర్లు పాల్గొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు చెప్పారు. ఇప్పుడు దేశం మొత్తం అమరావతివైపు, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని, క్వాంటం టెక్నాలజీ రంగంలో ఏపీ ఒక ‘పయనీర్’ గా ఎదిగే సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

About Kadam

Check Also

కథన సీమలో కొదమ సింహం.. మన ‘ఆకాష్’ వైపు బ్రెజిల్ చూపు..!

పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన తర్వాత, బ్రెజిల్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, ఇతర భారతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *