నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. తెలుగు రాష్ట్రాలను మబ్బులు కమ్మేశాయి. నైరుతికి అల్పపీడనం తోడై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని.. దీంతో మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతోపాటు గంటకు 30-40 కి.మీ.వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందంటే..
బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడుతోందని.. దీంతో తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.. నేడు తెలంగాణలోని 18 జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం.. ఉరుములు, మెరుపులతో గంటకు 30- 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు అన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీ వెదర్ రిపోర్ట్..
ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజంతా మేఘాలు ఉంటాయి. ఉదయం కొంత ఎండ కూడా ఉంటుంది. సాయంత్రం అక్కడక్కడా జల్లులు పడే ఛాన్స్ ఉంది. మిగతా ప్రాంతాల్లో రోజంతా పొడిగానే ఉంటుంది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు నంద్యాల, కర్నూల్, విశాఖ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. అంతేకాకుండా మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Amaravati News Navyandhra First Digital News Portal