ఒక పదిహేనేళ్ల పిల్లాడు కిరాతకంగా మర్డర్ చేస్తాడా? డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తాడా? పదేళ్ల చిన్నారి సహస్ర హత్య కేసులో ఈ కిల్లర్ మైండ్‌సెట్ ఇప్పుడు షాకింగ్‌గా మారింది? నెత్తురు చూస్తేనే భయపడే వయసులో, ఎలా నెత్తురు పారించాడు? సహస్ర తల్లిదండ్రుల గుండెకోత అందరినీ కలచివేస్తుంటే, ఈ పిల్లవాడి ప్రవర్తన మరోవైపు చర్చనీయాంశంగా మారింది.
కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల సహస్ర బర్త్ దే వేడుకలకూ హాజరైన బాలుడు ఆమెకు కేక్ తినిపించాడు. అదే చేతులతో బాలికను అత్యంత దారుణంగా హత్య చేయడం స్థానికులకు షాక్‌కు గురి చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సహస్రను హత్య చేసిన మైనర్ బాలుడిని జువైనల్ హోమ్‌కి తరలించారు పోలీసులు. నిందితుడికి ఇద్దరు అక్కలు.. తల్లి, తండ్రి ఉండగా.. అతడి తల్లి సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నారు. తండ్రి ఎలాంటి పనిచేయకపోవడంతో అప్పులున్నట్లు సమాచారం. క్రికెట్ కిట్ కొనుక్కోవడం కోసమే బాలుడి దొంగతనం చేశాడు. సహస్రను హత్య చేశాక కత్తిని క్లీన్ చేసి ఇంట్లోనే దాచిపెట్టాడు. ఇక ఆ మర్డర్ వెపన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
OTT, యూట్యూబ్ వీడియోలు చూడటం, క్రైమ్ సీన్స్ చూసి ఈ హత్య చేసినట్టు బాలుడు పోలీసుల విచారణలో తెలిపాడు. హత్య చేసి ఆ తర్వాత ఆధారలు మాయం చెయ్యడం నేర్చుకున్నాడు. పదుల సంఖ్యలో బాలుడిని పోలీసులు విచారించగా.. ఆ సమయంలో క్రిమినల్ ఇంటిలెజెంట్‌గా బాలుడు వ్యవహరించాడు. పోలీసులను పూర్తిగా తప్పుదోవ పట్టించాడు. క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళానని పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వగా.. అతడు రాసిన లెటర్‌లోనూ ఎక్కడా క్రికెట్ బ్యాట్ గురించి ప్రస్తావించలేదు. దేవుడు హుండీ కొట్టేసేందుకే బాలుడు వెళ్లినట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు.
నిందితుడి ఇంట్లో హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులు, ముందే రాసుకున్న లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దొంగతనం ఎలా చేయాలో నిందితుడు ముందే రాసుకున్నాడు. ఎంట్రీ నుంచి ఎస్కేప్ వరకూ పక్కాగా రాసుకున్నాడు. ఆ పిల్లాడి క్రిమినల్ బ్రెయిన్ చూసి పోలీసులే షాక్ అయ్యారు. చోరీ ఎలా చేయాలో.. అడ్డొస్తే ఏం చేయాలో అన్నింటినీ ముందే రాసుకునిమరీ దొంగతనానికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి సహస్ర ఇంట్లోకి ప్రవేశించాడు మైనర్ బాలుడు. ఘటన జరిగిన రోజు ఎక్కడ అనుమానం రాకుండా పోలీసుల వెంటే తిరిగాడు. అందరినీ విచారించే సమయంలో.. సహస్ర మూడుసార్లు డాడీ పిలిచిందని పోలీసులకి చెప్పిన మైనర్ బాలుడు. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇచ్చిన చిన్న హింట్‌తో మర్డర్ మిస్టరీ బ్రేకైంది. హత్య జరిగిన రోజు.. సహస్ర పక్కింట్లో ఓ కుర్రాడు.. నక్కినక్కి దాక్కోవడాన్ని ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చూడటంతో అడ్డంగా దొరికిపోయాడు.