3 లక్షల కోట్లతో ఏపీ పూర్తిస్థాయి బడ్జెట్.. అభివృద్ధికే అధిక కేటాయింపులు

అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రూ.3,22,359.33 కోట్లతో ఏపీ బడ్జెట్‌ ఉండగా.. రెవెన్యూ వ్యయం అంచనా- రూ.2,51,162 కోట్లని చెప్పారు. గత ప్రభుత్వ తప్పిదాలను.. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టిన ఆర్థిక మంత్రి. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని హిరోషిమాపై అణుదాడితో పోల్చారు పయ్యావుల. తమ పిల్లల భవిష్యత్ కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో.. ఇప్పుడూ అంతకు మించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.

ఏపీ బడ్జెట్ హైలైట్స్

సూపర్‌సిక్స్‌ పథకంలో ఒకటైన తల్లికి వందనం పథకం కింద 15వేల రూపాయలను కొత్త విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు పయ్యావుల కేశవ్‌ ప్రకటించారు. తల్లికి వందనంతో పాటు, మొత్తం పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్లను కేటాయించారు.

అమరావతి నిర్మాణానికి ఆరువేల కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ఇవన్నీ బయటనుంచి వచ్చేనిధులు అనీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమరావతికి నిధులు కేటాయించడం లేదని పయ్యావుల కేశవ్‌ చెప్పారు. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 6,705 కోట్లను, సాగునీటి ప్రాజెక్టులకు 11,314 కోట్లను కేటాయించారు.

  • మొత్తం మూడు లక్షల 22వేల 359 కోట్ల రూపాయల వ్యయ అంచనాతో వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం రెండు లక్షల 51వేల, 162 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. మూలధన వ్యయం 40,635 కోట్లుగా ఉండొచ్చనీ, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు,ద్రవ్యలోటు రూ.79,926 కోట్లుగా ఉండొచ్చని పయ్యావుల కేశవ్‌ అంచనా వేశారు.
  • అణుదాడిలో విధ్వంసమైన హిరోషిమా లేచి నిలబడగా లేనిది.. ఆర్థిక విధ్వంసం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి నిలబెట్టలేమా అనే మాటల స్ఫూర్తితో ఏపీ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
  • స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనే కూటమి లక్ష్యంమే నెలలో తల్లికి వందనం పథకంఒకే కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15000 చొప్పున ఇస్తాంఇచ్చిన హామీ ప్రకారం మత్స్యకారులు కూడా వేట నిషేధ కాలంలో 20000 ఆర్థిక సాయంపేదరిక నిర్మూలన లక్ష్యంగా… అన్నదాతకు ఏటా 20,000 ఇస్తాం..
  • డ్రిప్ ఇరిగేషనుకు ప్రాధాన్యత85 వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చేందుకు అనుమతులు.గ్రామీణ ప్రాంతాల్లో 95.44 లక్షల ఇళ్లకు రక్షిత తాగునీరు అందించేలా ప్రణాళికలు.గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, పశువుల పాకలు వంటి 30 వేల పనులను ఇప్పటికే మంజూరు చేసినట్టు వెల్లడి.4,300 కిలోమీటర్ల మేరకు మంజూరైన సి.సి.రోడ్లల్లో, ఇప్పటికే 3 వేల కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తైనట్టు స్పష్టీకరణ.మిగిలిన 1300 కి.మీ. మేర రోడ్ల నిర్మాణం తుది దశలో ఉన్నట్టు బడ్జెట్టులో ప్రస్తావన.
  • తెలుగు భాషాభివృద్ధికి రూ. 10 కోట్లు కేటాయింపు.తొలిసారిగా తెలుగు భాషకు నిధులను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.తెలుగు భాషకు తామిచ్చే ప్రాధాన్యతను తెలియచెప్పేలా నిధుల కేటాయింపు.మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచారం కోసం బడ్జెట్టులో ప్రత్యేక కేటాయింపులు.నవోదయం 2.0 స్కీం కింద మద్యపాన, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం కోసం నిధుల కేటాయింపు.కాలుష్య రహిత ఆంధ్రగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేపడుతున్నట్టు బడ్జెట్టులో ప్రస్తావన.రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచేలా చర్యలు.జీరో కాలుష్యం ఉండేలా ప్రణాళికలు రూపకల్పనపై బడ్జెట్టులో ప్రస్తావన.
  • ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు.టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్టులో గ్రీన్ సిగ్నల్.ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా రూ. 50 వేలు, ఎస్టీలకు అదనంగా రూ. 75 వేలు ఇవ్వనున్నట్టు బడ్జెట్టులో వెల్లడి.చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచిన ప్రభుత్వం.దీపం 2.0 కింద నిధుల కేటాయింపు.ఆదరణ పథకం పునః ప్రారంభించిన కూటమి ప్రభుత్వం.
  • 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్టులో విద్యా, మున్సిపాల్టీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక విధాన నిర్ణయాలు.అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్.ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందించడంతో స్థానిక సంస్థలకు తగ్గనున్న విద్యుత్ ఛార్జీల భారం.కేంద్రీకృత బిల్లుల చెల్లింపుల విధానం నుంచి మున్సిపాల్టీలకు విముక్తి.2024 ఏప్రిల్ నెల నుంచి తమ బిల్లులను తామే చెల్లింపులు జరుపుకునేలా మున్సిపాల్టీలకు స్వేచ్ఛ.క్యాపిటల్ ఎక్స్ పెడించర్ ప్రాజెక్టులు చేపట్టడానికిప్రత్యేక ప్రణాళికలు.ప్రవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులకు నిర్ణయం.ప్రొత్సాహకంగా ప్రాజెక్టులో 20 శాతం మేర వయబులిటి గ్యాప్ ఫండింగ్ ఇచ్చేలా స్కీం డిజైన్ చేసిన కూటమి ప్రభుత్వం.ప్రాజెక్టుల గ్యాప్ ఫండింగ్ స్కీం కోసం రూ. 2 వేల కోట్లతో కార్పస్ ఫండ్.
  • చేనేతలకూ ఉచిత విద్యుత్ అమలు.చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్.మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.నాయీ బ్రహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం.వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రామాలు.
  • 1-12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీం వర్తింపు.విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను జమ చేయనున్న ప్రభుత్వం.స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు.ఎటువంటి జాప్యం లేకుండా.. కార్పోరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్టులో ప్రస్తావన.ఈ ఏడాదిలోనే రూ. 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలు.ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్టు బడ్జెట్టులో వెల్లడి.ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
  • 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్టులో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్ద పీట వేశారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇచ్చేలా కేటాయింపులు ఇచ్చారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తుండగా.. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వరిస్తాయన్నారు.
  • ఏపీ బడ్జెట్‌లో అన్నదాత సుఖీభవ కోసం 6300 కోట్లు, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు 62 కోట్లు, ధరల స్థికరణ నిధి కోసం 300 కోట్లు, హంద్రీనీవా ఉత్తరాంధ్ర సృజన స్రవంతి గోదావరి డెల్టా కృష్ణ డెల్టా ప్రాజెక్టులకు 11,314 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 6705 కోట్లు, జల్జీవన్ మిషన్ కోసం 2800 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం 500 కోట్లు కేటాయించారు.


About Kadam

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *