ఇవాళ ఏపీ క్యాబినెట్ భేటీ… పలు కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ఉద‌యం 11 గంట‌ల‌కు సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న మంత్రిమండలి భేటీ కానుంది. క్యాబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వ‌నుంది. ప్రభుత్వం ఇప్పటికే 54,000 ఎకరాల భూమిని సేకరించింది. మరో 20 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై ఇవాళ్టి క్యాబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. రాజధాని అమరావతిలో 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెల‌ప‌నుంది. రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్‌కు అనుమతిపై క్యాబినెట్ సమావేంలో చర్చించనున్నారు. హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్‌పై చర్చించిన అనంతరం క్యాబినెట్‌ ఆమోదం తెల‌ప‌నుంది.

అమరావతిలో అల్లూరి, అమరజీవి స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించినందును అందుకు క్యాబినెట్‌ అమోదం తెల‌ప‌నుంది. అమ‌రావ‌తిలో ప‌లు సంస్థ‌ల‌కు భూ కేటాయింపులకు మంత్రిమండలి అమోదం తెల‌ప‌నుంది. బనకచర్ల ప్రాజెక్ట్ కు సంబంధించి క్యాబినెట్ లో ప్రత్యేకంగా చర్చించనున్నారు. సుపరిపాలన… తొలి అడుగు ఫీడ్ బ్యాక్ పై క్యాబినెట్ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. బంగారుపాళ్యంలో జగన్ పర్యటనపైనా మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నారు. జగన్ పర్యటనలో శాంతి భద్రతల సమస్యలపై మంత్రులు మాట్లాడనున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో తల్లికి వందనం కార్యక్రమం అమలుచేసిన తీరు, మహిళలకు ఆగస్టు 15 నుంచి అమలు చేయబోతున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి కూడా నేటి మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నారు. రైతు భరోసా పథకంపై మంత్రివర్గం దృష్టి సారించనుంది. పరిశ్రమల అభివృద్ధికి భూముల కేటాయింపు అంశం కూడా ఈ సమావేశంలో కీలకం కానుంది. ఇవాళ్టి క్యాబినెట్‌ సమావేశఃలో పలు బిల్లులకు కూడా ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.

About Kadam

Check Also

అంతా దైవ మహత్యమే.. అకస్మాత్తుగా గుడి ముందు ప్రత్యక్షమైన దేవుడి విగ్రహాలు.. చిన్న కథ కాదు..

ఆంధ్రప్రదేశ్‌ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు మండలం గారపాడులో స్థానికులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.  అందరూ అంత సంతోషం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *