చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. అమరావతిలో జనవరి నుంచే పనులు ప్రారంభం..

రాజధాని కోసం చేసే అప్పులు ఎలా తీరుస్తారు.. దీనిపై జనంలో గాని, అపోజిషన్ పార్టీల్లో గానీ ఉండే అనుమానాలేంటి.. కూటమి సర్కార్ ఇస్తున్న క్లారిటీలేంటి..? ఇదే కాదు.. అమరావతి నిర్మాణంపై ఉండే అన్ని డౌట్లనూ పటాపంచలు చేశారు మంత్రి నారాయణ. సీఆర్‌డీఏ కీలక సమావేశం తర్వాత.. బేఫికర్ అంటూ భరోసానిచ్చారు..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించాలన్న లక్ష్యంతో దూసుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే సిఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డిఎ 44వ సమావేశం జరిగింది. రాజధాని అమరావతిలో జరగబోయే నిర్మాణాలకు అనుమతులపై కీలక నిర్ణయాలు తీసుకుంది.

తాజాగా 2 వేల 723 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపింది CRDA. దీంతో కలిపి.. ఇప్పటివరకూ రాజధానిలో మొత్తం 47 వేల 288 కోట్ల పనులకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లయింది. జనవరి 15 నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు పురపాలకశాఖ మంత్రి నారాయణ.

అమరావతిపై వైసీపీ కక్ష ఇంకా తీరలేదని, అమరావతి రాజధాని కోసం తీసుకునే రుణాలపై విచ్చలవిడిగా తప్పుడు ప్రచారం చేస్తోందని విరుచుకుపడ్డారు మంత్రి నారాయణ. ఇక్కడి భూముల ద్వారా వచ్చిన ఆదాయంతోనే లోన్లు తీరుస్తాం తప్ప.. ప్రజలపై నయాపైసా కూడా భారం మోపబోమని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై రుణాలు తీసుకుని.. దారి మళ్లించిందని ఆరోపించారు మంత్రి నారాయణ. టిడ్కో ఇళ్లను నిరర్ధక ఆస్తుల జాబితానుంచి తప్పించడం కోసం 102 కోట్లు కట్టాల్సి వచ్చిందన్నారు. జూన్ 12 లోపు లక్షా 18 వేల ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించాలన్నది కూటమి సర్కార్ లక్ష్యం.

అమరావతి సమీపంలో నేలపాడు దగ్గర నిర్మించ తలపెట్టిన హ్యాపీ నెస్ట్ నిర్మాణ ప్రక్రియ స్పీడందుకుంది. దీని కోసం టెండర్లు ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకుని జనవరి 8లోగా బిడ్ వెయ్యాల్సి ఉంది.

About Kadam

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *