రాష్ట్రంలోని గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో ప్రమాదాలపై సీఎం చంద్రబాబు విచారం!

రాష్ట్రంలో పలుచోట్ల గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాల్లో జరిగిన ప్రమాదాలపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయా ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని వెస్ట్ గోదావరి జిల్లా తూర్పుతాళ్ళ గ్రామంలో గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాట్లు చేసిన గణేష్ విగ్రహ ఊరేగింపు చేస్తుండగా ఒక్కసారిగా ప్రమాదం చోటుచేసుకుంది. విగ్రహాన్ని తీసుకెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరి కొందరు భక్తులు గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాయపడిన వారిని వెంటనే స్థానిక హాస్పిట్‌కు తరలించారు. చనిపోయిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఎంతో సంతోషంగా వేడుక జరుపుకుంటున్న వారు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయా ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

అదే విధంగా అల్లూరి సీతా రామరాజు జిల్లా పాడేరు చింతలవీధి జంక్షన్ లో వినాయక నిమజ్జన కార్యక్రమంలో ప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందడంపై కూడా ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడినట్లు అధికారులు వివరించారు. వారికి అందుతున్న వైద్య సాయంపై సిఎం ఆరా తీశారు. నిర్లక్ష్యంతో ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యల తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

About Kadam

Check Also

ఏపీ మహిళలకు మరో గుడ్ న్యూస్.. ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం

స్త్రీ శక్తి పథకం పరిధి మరింత పెరిగింది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ వంటి గ్రౌండ్ బుకింగ్ బస్సుల్లోనూ మహిళలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *