న్యూసెన్స్‌ చేస్తే జైలులో వేస్తాం.. డ్రామాలాడితే తడాఖా చూపిస్తాం.. సీఎం చంద్రబాబు వార్నింగ్

ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సారి డిఫరెంట్‌గా ఫుల్‌ ఖుషీగా.. నవ్వుతూ.. హుషారుగా.. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వివిధ అంశాలపై ప్రసంగించిన చంద్రబాబు.. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీపై కన్నెర్ర చేశారు. జగన్‌ టార్గెట్‌గా పలు ఇంట్రిస్టింగ్‌ కామెంట్స్‌, వార్నింగ్‌లు ఇచ్చారు. ప్రధానంగా.. వైసీపీ ప్రతిపక్ష హోదా అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఎప్పుడిస్తారో.. ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసుకోవాలని మాజీ సీఎం జగన్‌కు సూచించారు. వైసీపీ అసత్య ప్రచారాలపైనా సీఎం చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

ఇక.. రెండు రోజల క్రితం పులివెందుల పర్యటనలో ఉల్లి, చీనీ పంటల రైతుల సమావేశంలో మాజీ సీఎం జగన్‌ చేసిన కామెంట్స్‌పై చంద్రబాబు ఫైర్‌ అయ్యారు. గత ప్రభుత్వంలో పులివెందులకు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారంటూ జగన్‌పై సెటైర్లు వేశారు. డ్రామాలాడితే తడాఖా అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.

మొత్తంగా.. ఏపీ సీఎం చంద్రబాబు డిఫరెంట్‌ స్టయిల్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఎప్పుడూ కూల్‌గా మాట్లాడే చంద్రబాబు.. గతానికి భిన్నంగా వార్నింగ్‌లతో.. మాస్‌ లీడర్‌లా మారిపోయారు. అదేసమయంలో.. కొందరు వైసీపీ నేతలు కావాలని రెచ్చగొడితే రెచ్చిపోవద్దని.. సంయమనం పాటించాలని టీడీపీ వర్గాలకు సూచించారు సీఎం చంద్రబాబు..

About Kadam

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *