ఆంధ్రప్రదేశ్‌లోని సీఆర్‌డీఏలో.. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమేరకు ఏపీ సీఆర్‌డీఏలో రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది. అమరావతిలో జరుగుతున్న రాజధాని నిర్మాణ పనులను పర్యవేక్షణకు పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఇందులో చీఫ్ ఇంజినీర్ పోస్టులు 4, సూపరింటెండింగ్ ఇంజినీర్ పోస్టులు 8, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు పోస్టులు 15. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు 25, సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు/అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు 50, సీనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ పోస్టులు 2, జూనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ పోస్టులు 4 ఉన్నాయి.
అలాగే సీనియర్ ఎలక్ట్రికల్/ ఈఎల్‌యూ ఎక్స్‌పర్ట్ పోస్టులు 2, జూనియర్ ఎలక్ట్రికల్/ఈఎలయూ ఎక్స్‌పర్ట్ పోస్టులు 6, సీనియర్ ఎక్స్‌పర్ట్ పోస్టులు 2, జూనియర్ ప్లంబింగ్ ఎక్స్పర్ట్ పోస్టులు 6, సీనియర్ హెచ్‌వీఏసీ ఎక్స్‌పర్ట్ పోస్టులు 2, జూనియర్ హెచ్వీఏసీ ఎక్స్‌పర్ట్ పోస్టులు 6 వరకు ఉన్నాయి. మొత్తం 132 వరకు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నింటినీ ఒప్పంద పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇతర సమాచారం కోసం ఏపీ సీఆర్‌డీఏ అధికారిక వెబ్‌సైట్ లోని కెరీర్స్ విభాగంలో చెక్ చేసుకోవాలని ఏపీసీఆర్‌డీఏ కమిషనర్ సూచించారు.
తెలంగాణ నీట్-పీజీ 2025 రాష్ట్ర ర్యాంకర్ల జాబితా విడుదల
నీట్ పీజీలో అర్హత సాధించిన మొత్తం 7,179 మంది తెలంగాణ పీజీ ర్యాంకర్ల జాబితాను కాళోజీ వర్సిటీ తాజాగా విడుదల చేసింది. నీట్ పీజీలో జాతీయ స్థాయిలో సురవరం రిత్విక్ రెడ్డి 16వ ర్యాంకు సాధించగా.. రాష్ట్రంలో పీజీ మొదటి ర్యాంకర్‌గా నిలిచాడు. కాయతి రోహన్‌రెడ్డి 22వ ర్యాంక్, గద్దె అలేఖ్య 43 ర్యాంక్, గంగం సిరిచందన 90వ ర్యాంక్, పుట్ట కార్తీక్ 103వ ర్యాంక్‌లు జాతీయ స్థాయిలో సాధించగా.. వీరు రాష్ట్ర ర్యాంకర్లలో వరుసగా 2, 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. మొదటి 5 ర్యాంకులు ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలకు దక్కాయి. అభ్యంతరాల స్వీకరణ అనంతరం పీజీ కౌన్సెలింగ్ రాష్ట్ర కోటా ప్రక్రియ ప్రారంభమవుతుంది.