తనదైన శైలిలో గురువులని గౌరవించిన ఏపీ డిప్యుటీ సీఎం.. ఉపాధ్యాయులకు సర్ప్రైజ్ గిఫ్ట్స్..

తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం గురువుకి ఇచ్చాం. అందుకనే ఆచార్య దోవో భవ అంటూ నమస్కరిస్తాం. ఈ రోజు టీచర్స్‌ డేని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. దేశాన్ని ఏలే రాజు కూడా ఒక గురువుకి శిష్యుడే. అవును దేశ భవిష్యత్ తరగతి గదిలోనే మొదలవుతుంది. ఆ తరగతి గదిలోనే పిల్లల తలరాతలను మార్చి అందమైన భవిష్యత్ కు బాటలు వేస్తారు. అటువంటి గురువులందరికీ.. ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలను ఏపీ డిప్యూటీ సిఎం చెబుతూ.. తన నియోజక వర్గంలో ఉన్న టీచర్స్ కు స్పెషల్ గిఫ్ట్స్ పంపించారు.

భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి టీచర్స్ డేగా జరుపుకుంటాం. ఈ రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురష్కరించుకుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కి నివాళులు అర్పించారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ తన నియోజక వర్గం పిఠాపురంలో ఉన్న సుమారు 2,000 మంది ఉపాధ్యాయులకు స్పెషల్ గిఫ్ట్స్ ని పంపించారు. టీచర్స్ కు దుస్తులను ఆయా స్కూల్ స్టూడెంట్స్ ద్వారా బహుమతులుగా ఇప్పించారు. చదువు చెప్పే గురువుని గౌరవించారు.

తమకు ఉపాధ్యాయ దినోత్సవం రోజున బహుమతి ఇవ్వడం.. అసలు ఊహకందని విషయం అని.. తమ ఇన్ని ఏళ్ల సర్వీస్ లో ఇలాంటి బహుమతిని ఎప్పుడూ అందుకోలేదని ఉపాధ్యాయులు ఆనందంతో చెబుతున్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, సన్మార్గంలో నడిపించే ఉపాధ్యాయులను పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేసిన నాయకులను చూసాం.. అయితే మొదటి సారి టీచర్స్ కి నిజమైన గౌరవం చూపిస్తూ ప్రోత్సహిస్తూ కానుకలను పంపిన నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెబుతున్నారు.

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని సుమారు 2000 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులకు చీరలు, ప్యాంట్ షర్ట్ లను కానుకగా పంపించారు. ఆ బట్టలను టీచర్స్ కు స్టూడెంట్స్ చేతుల మీదుగా అందజేశారు.

తన నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని గుర్తించుకుని అడగక ముందే సమస్యలను తీరుస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నందుకు తమకు ఎంతో ఆనందంగా ఉందని పలువురు చెబుతున్నారు. రాఖీ పండగ రోజున, వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలకు చీర పసుపు, కుంకుమను పవన్ కళ్యాణ్ అందించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో తనని గెలిపించిన పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రం నే కాదు దేశంలోనే గొప్ప నియోజకవర్గం గా అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకునే దిశగా పవన్ పలు అభివృద్ధి పనులు చేపట్టిన సంగతి తెలిసిందే.


About Kadam

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *